Muthoot Exim: రాజమండ్రిలో గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించిన ముత్తూట్ ఎగ్జిమ్
అప్పటి నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, మదురై, విజయవాడ, ఎర్నాకులం (కొచ్చి), నోయిడా, పూణే, హైదరాబాద్, ఇండోర్, విశాఖపట్నం, గుర్గావ్, మైసూరు వంటి ఇతర నగరాలకు విస్తరించింది.

Muthoot Exim: భారీ వ్యాపార సమ్మేళనం ముత్తూట్ పప్పచన్ గ్రూప్ తమ నూతన కేంద్రాన్ని రాజమండ్రిలో ప్రారంభించింది. ఈ గోల్డ్ పాయింట్ సెంటర్ రాష్ట్రంలో ముత్తూట్ ఎగ్జిమ్ ప్రారంభించిన మూడవ సెంటర్. వినియోగదారులకు తమ బంగారాన్ని విక్రయించడానికి విశ్వసనీయమైన, నమ్మకమైన కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసింది. ఇక్కడ వినియోగదారులు తమ బంగారాన్ని సౌకర్యవంతమైన, పారదర్శక విధానములో విక్రయించవచ్చు.
ఈ కొత్త బ్రాంచ్‌తో కంపెనీ ఈరోజు భారతదేశంలో 18 గోల్డ్ పాయింట్ సెంటర్‌లను కలిగి ఉంది. ఇందులో రెండు ‘మొబైల్ ముత్తూట్ గోల్డ్ పాయింట్’ సెంటర్లు కూడా వున్నాయి. ఇవి కస్టమర్ల ఇంటి నుంచి బంగారాన్ని సేకరిస్తాయి. ముత్తూట్ ఎగ్జిమ్, తమ గోల్డ్ పాయింట్ సెంటర్‌ల ద్వారా, పాత ఉపయోగించిన బంగారు వస్తువులను నేరుగా వినియోగదారుల నుంచి కొనుగోలు చేస్తాయి. తరువాత వాటిని తిరిగి ప్రాసెస్ చేసి, శుద్ధి చేసి, దేశీయ వినియోగానికి సరఫరా చేస్తారు.
ఈ సంస్థ ద్వారా 2015లో కోయంబత్తూరులో మొట్టమొదటి గోల్డ్ పాయింట్ సెంటర్ ప్రారంభించబడింది. అప్పటి నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, మదురై, విజయవాడ, ఎర్నాకులం (కొచ్చి), నోయిడా, పూణే, హైదరాబాద్, ఇండోర్, విశాఖపట్నం, గుర్గావ్, మైసూరు వంటి ఇతర నగరాలకు విస్తరించింది.