Star Health Policyholders : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుల నెత్తిన పిడుగు.. ఈ తేదీ నుంచి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ బంద్..!
Star Health Policyholders : దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్‌లెస్ సేవలు నిలిచిపోనున్నాయి..

Star Health Policyholders
Star Health Policyholders : స్టార్ హెల్త్ పాలసీదారులకు షాకింగ్ న్యూస్.. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇది మీకోసమే.. ఇకపై స్టార్ హెల్త్ నుంచి క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉండదు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటామని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (AHPI) హెచ్చరించింది. ఈ మేరకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తన విధానాలు, పద్ధతులను (Star Health Policyholders) మెరుగుపరచకపోతే, 22 సెప్టెంబర్ 2025 నుంచి పాలసీదారులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సేవలను నిలిపివేస్తామని ఏహెచ్‌పీఐ తెలిపింది.
బీమా సంస్థ అనేక సంవత్సరాలుగా టారిఫ్‌ను సవరించకపోవడం, క్లెయిమ్ తిరస్కరణ, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ విషయంలో ఏకపక్ష పద్ధతులు అనుసరించడం వంటి తీవ్రమైన సమస్యలను AHPI లేవనెత్తింది. ఆస్పత్రి బిల్లుల నుంచి అన్యాయమైన తగ్గింపులు, ఆమోదం తర్వాత కూడా క్లెయిమ్ తిరస్కరణలు వంటి అంశాలు అసోసియేషన్ లేవనెత్తిన అంశాలలో ఉన్నాయి.
సెప్టెంబర్ 22 నుంచి నో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ :
వాస్తవానికి.. ఏహెచ్‌పీఐ కంపెనీ సమస్యలను పరిష్కరించకపోతే పాలసీదారులకు నగదు రహిత సేవలను 22 సెప్టెంబర్ 2025 నుంచి నిలిపివేస్తామని తెలిపింది. ఏహెచ్‌పీఐ 15వేల కన్నా ఎక్కువ ఆస్పత్రులకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఆరోగ్య సంరక్షణ ఖర్చు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గత కొన్ని ఏళ్లుగా టారిఫ్‌ను పెంచడానికి నిరాకరిస్తున్నట్లు ఏహెచ్ పీఐ తెలిపింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. పాలసీదారులు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
స్టార్ హెల్త్‌తో ఇతర సమస్యలు :
ఇతర నెట్‌వర్క్ ఆస్పత్రులు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో అనేక ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నాయని AHPI తెలిపింది. పాత టారిఫ్‌ను మరింత తగ్గించాలని కంపెనీ ఒత్తిడి చేస్తోంది. ఆస్పత్రి బిల్లుల నుంచి అనవసరమైన కోతలు విధిస్తోంది. అప్రూవల్ తర్వాత కూడా క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుందని ఏహెచ్‌పీఐ తెలిపింది.
డాక్టర్ల నిర్ణయాలను కూడా బీమా కంపెనీ ప్రశ్నిస్తుందని ఆస్పత్రులు పేర్కొన్నాయి. ఈ తరహా విధానం పేషెంట్ సంరక్షణను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ పద్ధతితో రోగులతో పాటు వారి కుటుంబాలను అనేక ఇబ్బందులను సృష్టిస్తోందని ఏహెచ్ పీఐ తెలిపింది.
స్టార్ హెల్త్‌పై 13,300 ఫిర్యాదులు :
ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ 2023-24 నివేదికలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌పై 13,300 ఫిర్యాదులు నమోదయ్యాయని ఏహెచ్ పీఐ తెలిపింది. ఇందులో 10వేల ఫిర్యాదులు క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించినవే ఉన్నాయి. స్టార్ హెల్త్ అనుచిత వ్యవహార ధోరణిని అవలంబిస్తోందని ఏహెచ్ పీఐ ఆరోపించింది.
ఇతర బీమా కంపెనీలతో కలిసి కంపెనీ ఆస్పత్రుల టారిఫ్‌లను అణిచివేస్తోంది. దీని కారణంగా న్యాయమైన చర్చలు సాధ్యం కాదు. కంపెనీ క్రమబద్ధమైన వైఫల్యం, అన్యాయమైన పద్ధతి కారణంగా ఇలాంటి చర్య తీసుకోవలసి వచ్చిందని ఏహెచ్ పీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిర్ధర్ జ్ఞాని అన్నారు. రోగులు, ప్రొవైడర్లను రక్షించడమే తమ లక్ష్యమన్నారు.
డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ :
నగదు రహిత చికిత్స నిలిపివేస్తే.. ఆస్పత్రులు సెల్ఫ్-పేమెంట్ ప్రాతిపదికన చికిత్స అందించాల్సి ఉంటుంది. రోగులు డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. గతంలో AHPI బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ను క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సర్వీసును నిలిపివేయాలని హెచ్చరించింది. కానీ, చర్చల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గత ఆగస్టులో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో కూడా ఇలాంటి వివాదమే జరిగింది. ఆ తరువాత పరిష్కరించింది.
GIC నేతృత్వంలోని సాధారణ ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియ, బీమా సంస్థలు నగదు రహిత సేవలను అకస్మాత్తుగా నిలిపివేసి, మెంబర్ ఆస్పత్రులపై టారిఫ్‌లను తగ్గించడంలో ఒత్తిడి తీసుకురావడంపై అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పోటీ వ్యతిరేకమని, సరైన చట్టపరమైన ఆధారం లేదని తెలిపింది.