My Home Akrida : అంతర్జాతీయ హంగులతో మైహోమ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్ అక్రిద.. శంకుస్థాపన ఎప్పుడంటే?

My Home Akrida : మై హోమ్ అక్రిద ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్‌పోర్టు సదుపాయం అందుబాటులో ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓల్డ్ ముంబై హైవేకు కూతవేటు దూరంలోనే ప్రాజెక్టు డెవలప్ అవుతుంది.

My Home New Project Akrida in Tellapur in Hyderabad city

My Home Akrida : మరో రెండు రోజుల్లో మైహోమ్‌ గ్రూప్‌ (My Home Group) నుంచి మరో ప్రెస్టిజియస్‌ ప్రాజెక్ట్‌ లాంచ్‌ కాబోతోంది. తెల్లాపూర్‌ టెక్నోసిటీలో అంతర్జాతీయ హంగులతో రాబోతోన్న కొత్త ప్రాజెక్ట్‌ మైహోమ్‌ అక్రిదకు ఈ ఆదివారం (ఆగస్టు  11న) శంకుస్థాపన జరగబోతోంది. అధునాతనమైన సౌకర్యాలు, విశాలమైన లాంజ్‌, విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ కోసం ఓపెన్‌ స్పెస్‌తో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రతిమా గ్రూప్‌తో కలిసి మై హోమ్‌ గ్రూప్‌ సంయుక్తంగా చేపడుతోంది.

మొత్తం 12 హైరైజ్ టవర్స్ నిర్మాణం :
ఇప్పటికే పలు విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిన మై హోమ్‌ గ్రూప్‌.. తెలంగాణలో  అత్యంత విశ్వసనీయమైన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా తెచ్చుకుంది. 25 ఎకరాల విస్తీర్ణంలో 81శాతం ఓపెన్‌ స్పేస్‌ ప్రాజెక్ట్‌గా అక్రిద ప్రాజెక్టును డెవలప్‌ చేయనుంది ఈ సంస్థ. మొత్తం ఈ కొత్త మైహోం ప్రాజెక్ట్‌లో 12  హైరైజ్‌  టవర్స్‌ నిర్మించనున్నారు. జీ ప్లస్‌ 39 అంతస్తుల్లో మొత్తం 3వేల 780 ప్రీమియం ఫ్లాట్లను అత్యంత సుందరంగా ముస్తాబు చేయనుంది మైహోమ్‌ గ్రూప్‌.

Read Also : My Home Group : తెల్లాపూర్‌లో మైహోమ్ సంస్థ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లు ప్రారంభం

అక్రిద ప్రాజెక్ట్‌లో 2 BHK, 2.5 BHK, 3  BHKల్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయి. 2  BHK ఫ్లాట్స్‌ను 13వందల 99  SFTల్లో.. 2.5 BHKను 16వందల 22 SFTల్లో  నిర్మిస్తున్నారు. ఇక 3BHK  ఫ్లాట్స్‌ను మొత్తం 4 విస్తీర్ణాల్లో డెవలప్‌ చేస్తున్నారు. 1926,  2012, 2262, 2347 SFTల్లో  3BHK ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీలన్నీ  ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ ఫేసింగ్‌తో  ఉంటాయి.

రెండు క్లబ్‌  హౌస్‌ల ఏర్పాటు :
ఈ ప్రాజెక్ట్‌ స్పెసిఫిక్‌ ఎమినిటీస్‌ విషయానికి వస్తే  ప్రతి టవర్‌లో డబుల్‌ హైట్‌ ఎంట్రన్స్‌  లాబీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో నివసించే వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా నాలుగు  బేస్‌మెంట్లలో కార్‌ పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. బ్యూటీఫుల్‌ క్రాఫ్టెడ్‌  ల్యాండ్‌స్కేప్‌ ఈ ప్రాజెక్ట్‌కు  హైలైట్‌గా చెప్పొచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో రెండు క్లబ్‌  హౌస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి  క్లబ్‌ హౌస్‌ను G ప్లస్‌ 4 ఫ్లోర్స్‌లో 58వేల  SFTల్లో డెవలప్‌ చేయనున్నారు. రెండో క్లబ్‌  హౌస్‌ను G ప్లస్‌ 3 ఫ్లోర్స్‌లో 47వేల SFTల్లో  అభివృద్ధి చేయనుంది మైహోమ్‌ గ్రూప్‌.

మై హోమ్ అక్రిద ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్‌పోర్టు సదుపాయం అందుబాటులో ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓల్డ్ ముంబై హైవేకు కూతవేటు దూరంలోనే ప్రాజెక్టు డెవలప్ అవుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. అలాగే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, టాప్ హాస్పిటల్స్, మాల్స్ ఔటర్ రింగ్ రోడ్‌కు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. 35 నిమిషాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రాజెక్ట్ నుంచి వెళ్లొచ్చు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్స్‌కి వెళ్ళచ్చు.

100 శాతం పవర్ బ్యాకప్.. మరెన్నో భద్రతా ఏర్పాట్లు :
మైహోమ్ అక్రిద ప్రాజెక్టులో భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. ప్రాజెక్టులోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఫైర్ అలారం, అన్ని అగ్నిమాపక గైడ్ లైన్స్ ప్రకారం సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టులో 100 శాతం పవర్ బ్యాకప్ ఉంటుంది. ఎల్‌పీజీ, పీఎన్‌జీ పైపులైన్ అన్ని ప్లాట్లకు అందిస్తారు.

ఈ నెల 11న స్పెషల్ బుకింగ్ ఆఫర్ :
జాయిన్ హ్యాపినెస్ అనుభూతిని పొందాలనుకునే వారు ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీని కచ్చితంగా కొనుగోలు చేయాలని మైహోమ్ చెబుతోంది. ఈ ప్రాజెక్టులో ఎస్ఎఫ్‌టీ బుకింగ్ ప్రైస్ రూ. 7,400 కాగా, ఈనెల 11న బుకింగ్ చేసుకునే వారు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద రూ. 7200 కొనుగోలు చేయుచ్చని కంపెనీ ప్రకటించింది.

Read Also : My Home Akrida : హైదరాబాద్‎లో మరో టాలెస్ట్ టవర్.. 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్‌ అక్రిద

ట్రెండింగ్ వార్తలు