Credit Score Myths
Credit Score Myths : క్రెడిట్ స్కోర్ పదేపదే చెక్ చేస్తే తగ్గుతుందా? ఏయే సందర్భాల్లో క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.. చాలామందికి దీనిపై పెద్దగా అవగాహన ఉండదు. క్రెడిట్ స్కోరు ఎక్కడ తగ్గుతుందోనని ఆందోళన చెందుతుంటారు. అలా చేస్తే తగ్గుతుంది.. ఇలా చేస్తే క్రెడిట్ స్కోరు తగ్గుతుందని ఎవరో చెబితే అనవసరంగా ఆందోళన చెందుతుంటారు.
క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసినా లేదా బ్యాంకు అకౌంట్లు ఒకటికి మించి ఉండటం, లోన్ ఈఎంఐ పేమెంట్లు, లోన్లు తీసుకోవడం వల్ల క్రెడిట్ స్కోరు తగ్గుతుందనే చాలా అపోహలు ఉన్నాయి. వాస్తవానికి ఇందులో నిజం లేదని గమనించాలి.. అసలు క్రెడిట్ స్కోరు తగ్గడానికి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.. అవేంటో తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు..
పదేపదే క్రెడిట్ స్కోరు చెక్ చేయడం :
చాలామంది క్రెడిట్ స్కోర్ ఎక్కడ తగ్గుతందోనని భయపడి క్రెడిట్ రిపోర్టు చూడరు. సొంత క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తే సాఫ్ట్ ఎంక్వైరీగా పరిగణిస్తారు. క్రెడిట్ స్కోరుకు ఎలా ఎఫెక్ట్ పడదు. రిపోర్ట్ చెక్ చేయడం వల్ల అందులో ఏమైనా తప్పులను గుర్తించవచ్చు. మనకు తెలియకుండా లోన్లు తీసుకుంటే అందులో తెలిసిపోతుంది.
హార్డ్ ఎంక్వైరీ చేసిన సమయాల్లో మాత్రమే క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తే అది హార్డ్ ఎంక్వైరీగా చెప్పవచ్చు. ఇలా ఎక్కువగా సార్లు జరిగితే క్రెడిట్ స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది కూడా టెంపరరీ మాత్రమేనని గమనించాలి.
బ్యాంకు అకౌంట్లు ఎక్కువగా ఉంటే కూడా క్రెడిట్ స్కోరు తగ్గుతుందని భావిస్తుంటారు. ఇందులో నిజం లేదు. వాస్తవానికి, క్రెడిట్ కార్డుల సంఖ్య, లోన్ పేమెంట్ల ఆధారంగా క్రెడిట్ స్కోరులో హెచ్చుతగ్గుదల కనిపిస్తుంది. బ్యాంకు అకౌంట్లు ఎన్ని ఉన్నా పర్వాలేదు.
ఆయా అకౌంట్లలో తగినంత బ్యాలెన్స్ మెయింటెన్స్ చేస్తే చాలు.. పర్సనల్ లోన్ ముందుగా చెలిస్తే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందనేది కేవలం అపోహ మాత్రమే. డ్యూ డేట్ కన్నా ముందుగా చెల్లించిన ఎలాంటి నష్టం ఉండదు. సకాలంలో పేమెంట్ చేశారు కాబట్టి క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది.
పాత క్రెడిట్ కార్డు, కొత్త క్రెడిట్ కార్డు రెండింటిలో లోన్ ఉంటే.. లోన్ అకౌంట్ క్లోజ్ అయితే అకౌంట్ల సగటు వయస్సు ఎఫెక్ట్ అవుతుంది. అయినప్పటికీ ఆందోళన అవసరం లేదు. లోన్ తిరిగి చెల్లించగలరని సూచిస్తుంది. క్రెడిట్ కార్డుపై ఏదైనా రుణం ఉంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని భావిస్తుంటారు. అలా ఎప్పుడు జరగదు. ప్రతి నెలా ఈఎంఐ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తేనే క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. క్రెడిట్ వాడకం నిష్పత్తి తగ్గుతుంది.