Oppo A5 5G Launch : లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ఒప్పో A5 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. ధర, ఫీచర్లపై బిగ్ ట్విస్ట్ ఇదే..!

Oppo A5 5G Launch : ఒప్పో కొత్త ఫోన్ రాబోతుంది. ఒప్పో A5 5G ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి..

Oppo A5 5G Launch : లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ఒప్పో A5 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. ధర, ఫీచర్లపై బిగ్ ట్విస్ట్ ఇదే..!

Oppo A5 5G Launch

Updated On : June 21, 2025 / 6:44 PM IST

Oppo A5 5G Launch : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఒప్పో A5 5G  అతి త్వరలో లాంచ్ కానుంది. స్మార్ట్‌ప్రిక్స్ ప్రకారం.. ఈ 5G ఫోన్ ఇప్పటికే లీక్ అయిన లైవ్ ఇమేజ్‌లో కనిపించింది. బడ్జెట్ 5G కేటగిరీలో (Oppo A5 5G Launch) అద్భుతమైన పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో రానుంది. రాబోయే ఒప్పో A5 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వంటి వివరాలు అంచనాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

డిజైన్, డిస్‌ప్లే.. పంచ్-హోల్ డిజైన్‌ :
ఒప్పో A5 5G ఫోన్ పంచ్-హోల్ నాచ్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో రావచ్చు. స్క్రీన్ 6.6 అంగుళాలు (16.94 సెం.మీ) సైజులో ఉంటుంది. స్క్రీన్ HD+ రిజల్యూషన్‌తో LCD ప్యానెల్, అల్ట్రా-స్మూత్ గ్రాఫిక్స్ కోసం 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉండొచ్చు.

పర్ఫార్మెన్స్ సాఫ్ట్‌వేర్ :
హుడ్ కింద, ఒప్పో A5 5G, ప్రో 5Gలో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ ఉండనుంది. మల్టీ టాస్కింగ్ కోసం 6GB ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ కలిగి ఉంది. 128GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15.0తో వస్తుంది. ఒప్పో ట్రినిటీ ఇంజిన్ కూడా ఉంది. గేమింగ్, యాప్‌ యాక్సస్ కోసం మరింత పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్టు :
ఈ ఒప్పో ఫోన్ భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. రోజంతా ఛార్జింగ్ వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 45W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫింగర్ ప్రింట్ రీడర్, IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఆప్టిమల్ సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు ఉండవచ్చు.

Read Also : Motorola Edge 50 Fusion : కిర్రాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కేవలం రూ. 15వేల లోపే.. ఇప్పుడే కొనడం బెటర్..!

కెమెరా (Oppo A5 5G Launch) ఫీచర్లు (అంచనా) :
అధికారిక కెమెరా వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఒప్పో ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 50MP ప్రైమరీ సెన్సార్ డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌తో రావచ్చు.  ధర విషయనికి వస్తే.. ఫొటోగ్రఫీ, సెల్ఫీ-సామర్థ్యంతో యూజర్లకు ఈ సెటప్‌తో రానుంది.

ధర, మోడల్ వివరాలు (అంచనా) :
ఒప్పో A5 5G మొత్తం రెండు మోడళ్లలో వస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీతో రానుంది. బేస్ మోడల్ ధర రూ. 15,499 (సుమారు 180 డాలర్లు). ఈ స్పెషిఫికేషన్లతో చౌకైన 5G ఫోన్‌లలో రానుంది. ఒప్పో A5 5G ఫోన్ హై-బ్యాటరీ, సిల్కీ-స్మూత్ స్క్రీన్, ఆకర్షణీయమైన డిజైన్ రూ. 16వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. లీకైన స్పెసిఫికేషన్ల ఆధారంగా పరిశీలిస్తే.. ఫ్యూచర్-ప్రూఫ్ కనెక్టివిటీతో వస్తుంది.