Samsung Galaxy Z Fold 6 5G : కళ్లుచెదిరే డిస్కౌంట్.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇదే బెస్ట్ టైమ్..!
Samsung Galaxy Z Fold 6 5G : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ ఇలా సొంతం చేసుకోండి..

Samsung Galaxy Z Fold 6 5G
Samsung Galaxy Z Fold 6 5G : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ మీ బడ్జెట్ ధరలో లభ్యమవుతోంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 లాంచ్‌కు ముందే (Samsung Galaxy Z Fold 6 5G) గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర భారీగా తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.40,500 కన్నా ఎక్కువ సేవ్ చేయొచ్చు.
గత ఏడాది భారత మార్కెట్లో శాంసంగ్ రూ.1,64,999 ధరకు లాంచ్ చేసింది. డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు అమెజాన్‌లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రూ.1,27,000 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర రూ.1,24,499కి లిస్ట్ చేసింది. అసలు ధర కన్నా దాదాపు రూ.40,500 తగ్గింది. SBI, HDFC, OneCard బ్యాంక్ కార్డులతో కస్టమర్లు రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ.1,23,300కి తగ్గుతుంది.
నెలకు రూ.6,036తో ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా కొనుగోలుదారులు రూ.48,550 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయకపోతే.. అదనపు ఖర్చుతో ఎక్స్‌టెండెడ్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్ కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5Gలో 7.6-అంగుళాల అమోల్డ్ 2X మెయిన్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్, 6.3-అంగుళాల అమోల్డ్ 2X కవర్ స్క్రీన్ ఉన్నాయి. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 25W ఛార్జింగ్‌తో 4400mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. కెమెరా కాన్ఫిగరేషన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఈ శాంసంగ్ ఫోన్ సివర్ స్క్రీన్‌పై 10MP సెల్ఫీ కెమెరా, డిస్‌ప్లే కింద 4MP కెమెరాను కలిగి ఉంది.