Ekagrah Rohan : కేవలం 5 నెలల వయస్సులోనే మిలియనీర్.. రూ.240 కోట్ల ఆస్తికి అధిపతిగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ముద్దుల మనవడు..!

దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో మిలియనీర్ గా రోహన్ అవతరించాడు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డివిడెంట్ నుంచి బుల్లి మిలియనీర్ రోహన్ ఏకంగా రూ. 4.2 కోట్లను సంపాదించాడు.

Ekagrah Rohan : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ముద్దుల మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి మిలియనీర్ అయ్యాడు. కేవలం 5 నెలల వయస్సులోనే రూ. 240 కోట్ల ఆస్తికి ఆధిపతి అయ్యాడు. దాంతో దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో మిలియనీర్ గా రోహన్ అవతరించాడు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ డివిడెంట్ నుంచి రూ. బుల్లి మిలియనీర్ రోహన్ ఏకంగా రూ. 4.2 కోట్లను సంపాదించాడు.

Read Also : Vivo V30e Launch : మే 2న వివో V30e 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

గత నెలలో తాత మూర్తి రూ. 240 కోట్ల కన్నా విలువైన ఇన్ఫోసిస్ 15 లక్షల షేర్లను (0.04శాతం వాటా) మనవడికి ఇచ్చిన తర్వాత అతడి సంపాదన అమాంతం పెరిగిపోయింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇన్ఫోసిస్ 15లక్షల షేర్లను ఏకగ్రాహ్ సొంతం చేసుకున్నాడని వెల్లడించింది.

ఏకగ్రహ రోహన్ ఎవరంటే? :
బెంగళూరులో గత ఏడాది నవంబర్ 10న ఏకగ్రహ్ రోహన్ మూర్తి జన్మించాడు. నారాయణ మూర్తి, సుధా మూర్తిలకు రోహన్ మూడో మనవడు. ఇప్పటికే మూర్తికి కృష్ణ, అనౌష్క మనవరాళ్లు ఉన్నారు. అయితే, ఐదు నెలల రోహన్.. అపర్ణ కృష్ణన్‌, రోహన్ మూర్తిల కుమారుడు కాగా, కృష్ణ, అనౌష్క ఇద్దరూ అక్షతా మూర్తి, యూకే ప్రధాని రిషి సునక్ కుమార్తెలు. రాజ్యసభ ఎంపీ అయిన సుధామూర్తికి ఇన్ఫోసిస్ కంపెనీలో 0.93 శాతం షేర్లు ఉండగా, కుమారుడు రోహన్​ 1.64 శాతం షేర్లు, కుమార్తె అక్షతా మూర్తి 1.05 శాతం షేర్లు కలిగి ఉన్నారు.

రూ.37,923 కోట్లకు చేరిన కంపెనీ ఆదాయం :
ఇన్ఫోసిస్ నాల్గవ త్రైమాసిక లాభంలో 30శాతం పెరుగుదలను ప్రకటించింది. గత ఏడాదిలో రూ. 6,128 కోట్లతో పోలిస్తే.. రూ. 7,969 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా స్వల్పంగా పెరిగి రూ.37,923 కోట్లకు చేరుకుంది. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 8.9శాతం పెరిగి రూ. 26,233 కోట్లకు చేరుకుంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వార్షిక ఆదాయం 4.7శాతం పెరిగి రూ. 1,53,670 కోట్లకు చేరుకుంది.

ఇన్ఫోసిస్ బోర్డు ప్రతి షేరుకు రూ. 8 ప్రత్యేక డివిడెండ్‌తో పాటు గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ. 20 చొప్పున తుది డివిడెండ్‌ను అందించింది. అదనంగా, ఇన్ఫోసిస్ 450 మిలియన్ యూరోల విలువైన ఆల్-క్యాష్ డీల్‌లో ఒక జర్మన్ సంస్థ, ఇన్-టెక్‌ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 1నుంచి 3శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ ఆదాయం ఎంతమేర పెరుగుతుందనే అంచనా కాస్తా తాము అనుకున్నదానికంటే తక్కువగానే ఉందని పరిశోధన సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలిపారు. ఇన్ఫోసిస్ మీడియం టర్మ్‌లో మెరుగైన పనితీరు కనబరుస్తుందని భావిస్తున్నారు. మరో సంస్థ, నువామా ఆర్థిక సంవత్సరం తర్వాత ఇన్ఫోసిస్ వేగంగా వృద్ధి చెందుతుందని భావిస్తోంది.

Read Also : Realme Narzo 70x 5G : రియల్‌మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 24నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు