×
Ad

Netflix Cheaper Plans In India : నెట్‌ఫ్లిక్స్ చౌకైన యాడ్ సపోర్టెడ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్లు.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Netflix Cheaper Plans In India : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం (Netflix) కొత్త సబ్‌స్క్రైబర్‌లతో యూజర్లను ఆకర్షించేందుకు చౌకైన యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల (cheaper ad-supported subscription plans)ను తీసుకొస్తోంది.

Netflix Cheaper Plans In India This is how much Netflix’s cheaper ad-supported subscription plans will likely cost in India

Netflix Cheaper Plans In India : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం (Netflix) కొత్త సబ్‌స్క్రైబర్‌లతో యూజర్లను ఆకర్షించేందుకు చౌకైన యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల (cheaper ad-supported subscription plans)ను తీసుకొస్తోంది. నెట్ ఫ్లిక్స్‌లో పేమెంట్ సబ్‌స్క్రైబర్‌లలో భారీగా తగ్గుదల కనిపించింది. దాంతో యూజర్లను ఆకట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ వివిధ మార్గాలలో కొత్త సబ్‌స్క్రైబర్‌ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఉన్న నెట్‌ఫ్లిక్స్ యూజర్లు కొత్త యూజర్లను పొందవచ్చునని నెట్‌ఫ్లిక్ అంచనా వేస్తోంది. స్ట్రీమింగ్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను రూపొందించేందుకు యాడ్ నెట్‌వర్క్‌ను రూపొందించే డీల్ కుదుర్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ టెక్నికల్, ఫస్ట్ యాడ్-సపోర్టు సబ్‌స్క్రిప్షన్ మరింత మెరుగుపర్చేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేపట్టింది.

ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలకు సంబంధించి వివరణ ఇచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ కొత్త యాడ్-సపోర్టెడ్ ప్లాన్ 7 డాలర్లు (సుమారు రూ. 559), 9 డాలర్లు (సుమారు రూ. 719) మధ్య ధరలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం, నెట్‌ఫ్లిక్స్ బేస్ ప్లాన్ 9.99 డాలర్లు వసూలు చేస్తోంది. ఒక డివైజ్ మాత్రమే సపోర్టు చేస్తుంది. భారత మార్కెట్లో Netflix మొబైల్ ప్లాన్ నెలకు రూ. 149, ప్రాథమిక ప్లాన్‌కు రూ. 199, స్టాండర్డ్ ప్లాన్‌కు రూ. 499, ప్రీమియం ప్లాన్‌కు రూ. 649 నుంచి ప్రారంభమవుతుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి కుమికో హిడాకా ప్రకారం.. తక్కువ ధరకే యాడ్-సపోర్టెడ్ టైర్‌ను ఎలా ప్రారంభించాలి అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

This is how much Netflix’s cheaper ad-supported subscription plans will likely cost in India

కొత్త చౌకైన ప్లాన్‌లు ప్రస్తుత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ల కన్నా తక్కువ నెలవారీ చార్జీలతో అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ల మధ్య యాడ్స్ చూసేందుకు ఇష్టపడే యూజర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. నివేదికల ప్రకారం.. యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లు ప్రతి గంటకు 4 నిమిషాల యాడ్‌లను అందిస్తున్నాయి. చౌకైన యాడ్-సపోర్టు ఉన్న ప్లాన్‌లతో కొన్నిఇబ్బందులు ఉన్నాయి. యూజర్లు ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో చూసేందుకు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన పనిలేదు. యాప్‌లోని అన్ని లైసెన్స్ కంటెంట్‌కు కూడా యూజర్లు యాక్సెస్ చేయలేరు.

అయినప్పటికీ, యూజర్లు ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ లేదా రియల్ మూవీలు సిరీస్‌లను యాక్సెస్ చేయవచ్చు. చౌకైన ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్‌లు 480p కంటే ఎక్కువ రిజల్యూషన్‌లో షోలను చూడవచ్చా అంటే ఎలాంటి సమాచారం లేదు. నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేస్తోంది. ముందుగా ఈ ప్లాన్ల ప్రారంభ సమయంలో యూజర్లు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు మరిన్ని ఆప్షన్లను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు, ప్రీమియం కనెక్ట్ అయిన టీవీ ఇన్వెంటరీకి యాక్సెస్‌ను పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అందించిన అన్ని యాడ్స్ మైక్రోసాఫ్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. యూజర్ల డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు ప్రైవసీపరంగా మైక్రోసాఫ్ట్ అనేక విధానాలను అమలు చేయనుందని మైక్రోసాఫ్ట్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Read Also : Netflix Update : నెట్‌ఫ్లిక్స్‌లో మూవీలు, టీవీ సిరీస్ చూసేటప్పుడు ఇక యాడ్స్ కనిపించవు!