Personal Data After Death : ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల పర్సనల్ డేటా మీద హక్కు ఎవరిది?
Personal Data After Death : 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అన్నీ కూడా వారసులకే చెందడానికి ఆస్కారం పూర్తిగా లేదు.
personal data after death ( Image Credit : AI ChatGPT )
- వ్యక్తి మరణం తర్వాత ఆన్లైన్ లైఫ్ ఎవరు కంట్రోల్ చేస్తారు?
- చనిపోయిన మనిషి డేటా మీద హక్కు కుటుంబానిదా? లేక కంపెనీలదా?
- మరణం తర్వాత ప్రైవసీ హక్కులు ఉంటాయా? షాకింగ్ ఫాక్ట్
- డిజిటల్ ఆస్తులపై వ్యక్తి మరణం తర్వాత అసలు యజమాని ఎవరు?
Personal Data After Death : ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల వ్యక్తిగత డేటా మీద హక్కు ఎవరికి ఉంటుంది? ఈ ప్రశ్నకి సమాధానం చాలా క్లిష్టమైంది. ఆ వ్యక్తికి సంబంధించిన వారసులకు చెందుతుందా? లేకపోతే ఆ వ్యక్తి ఆల్రెడీ ఎవరినైనా డిజిటల్ నామినీగా పెడితే వాళ్లకు చెందుతుందా? దీనికి సబంధించి పెద్ద లీగల్ వివాదం కొంతకాలంగా నడుస్తోంది. 1925 వారసత్వ హక్కు చట్ట ప్రకారం వారసులకు కొన్ని హక్కులు ఉంటాయి.
ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే.. ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న (Personal Data After Death) భూములు, బ్యాంకులో డబ్బులు, ఇతర స్థిరాస్తులు, తదితర అంశాలకు సంబంధించి వారసులకే హక్కులు వస్తాయి.
అయితే, డిజిటల్ కి సంబంధించి మాత్రం కొన్ని క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అన్నీ కూడా వారసులకే చెందడానికి ఆస్కారం పూర్తిగా లేదు.
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 లోని సెక్షన్ 14 ప్రకారం ఒక వ్యక్తి తన డిజిటల్ ఎసెట్స్ (ఈమెయిల్, యూట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్, క్లౌడ్ స్టోరేజీ, ఇతర ఆన్ లైన్ అకౌంట్స్) ను మేనేజ్ చేయడానికి ఒక వ్యక్తి లేదా వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. అంటే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తే లేకపోతే ఆ వ్యక్తి తన అకౌంట్స్ మేనేజ్ చేయలేని స్థితికి చేరుకుంటే ఆ అకౌంట్స్ ను నామినేట్ చేయబడిన వ్యక్తి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.
చనిపోయిన వ్యక్తి డేటాను వారసులు పొందలేరా?
ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా నిర్వహించే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లేదా ఈమెయిల్స్ లేదా క్లౌడ్ స్టోరేజ్ లో సమాచారం నిల్వ చేసి ఉండొచ్చు. అది తనకు మాత్రమే ప్రైవేట్ అని భావించి ఉండొచ్చు.
Read Also : Bank Account : చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ ఎవరికీ ఎందుకు చూపించరో తెలుసా? ఫుల్ డిటెయిల్స్
కొన్ని సార్లు కుటుంబసభ్యులకు సర్ ప్రైజ్ చేద్దామనో లేకపోతే కుటుంబసభ్యులకు కూడా తెలియకుండా దాచాల్సిన అంశం అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తి తను మరణించిన తర్వాత తన డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేయడానికి కుటుంబసభ్యులకు కాకుండా వేరే వారిని నామినేట్ చేస్తే.. ఆ అకౌంట్స్ లో ఉన్న డేటాను యాక్సెస్ చేసే అవకాశం నామినీకి మాత్రమే ఉంటుంది.
డిజిటల్ అసెట్స్ లో ఆస్తులు ఉంటే అప్పుడు ఏంటి?
ఒక వ్యక్తి యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తూ ఉండొచ్చు. కుటుంబానికి తెలియని కొంత క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్స్ ఉండొచ్చు. బిజినెస్ కు సంబంధించిన కీలక అగ్రిమెంట్లు, డేటా అంతా ఈమెయిల్స్ లో ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ డిజిటల్ నామినీ అకౌంట్స్ యాక్సెస్ తీసుకుని కుటుంబానికి తెలియకుండా ఆ డేటా అంతా డిలీట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఈ పాయింట్ కోర్టుల్లో నలుగుతోంది.
ఆస్తులన్నీ కుటుంబసభ్యులవే..
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం ఒక వ్యక్తి తన డిజిటల్ అసెట్స్ మానిటర్ చేయడానికి ఎవరినైనా నామినేట్ చేస్తే వాళ్లు కేవలం నామినీలు మాత్రమే. ఆ వ్యక్తి చనిపోయినా లేకపోతే ఆ వ్యక్తి పర్మిషన్ తో అకౌంట్స్ నిర్వహించినా అది కేవలం విధి మాత్రమే. వారికి ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై ఎలాంటి హక్కులు ఉండవు.
వాళ్లు కేవలం కస్టోడియన్ గా మాత్రమే ఉంటారు. అంటే వాళ్లు ట్రస్టీలుగానో, అకౌంట్స్ కి కేర్ టేకర్ గానో ఉంటారు అంతే. కానీ, చనిపోయిన వ్యక్తి ఆస్తులు అన్నీ లీగల్ గా వారసులకే చెందుతాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇన్సూరెన్సులు, ఇతరత్రా వాటిలో ఏం జరుగుతుందో ఈ డిజిటల్ రూపంలో ఉన్న ఆస్తులు కూడా వారికే చెందుతాయి.
