×
Ad

New EPFO Rule : ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇకపై జాబ్ మారినా నో టెన్షన్.. మీ PF ఆటో ట్రాన్స్‌ఫర్ అయినట్టే..!

New EPFO Rule : పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం ఇకపై చాలా ఈజీ.. ఈపీఎఫ్ఓ బిగ్ రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

New EPFO Rule

New EPFO Rule : పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ విషయంలో ఆందోళన అక్కర్లేదు. పేపర్ వర్క్ ఉండదు.. అసలు ఆలస్యం కాదు.. ఇకపై పీఎఫ్ ఫండ్ స్పీడ్‌గా ఒక అకౌంట్ నుంచి కొత్త అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. సాధారణంగా చాలామంది పీఎఫ్ ఖాతాదారులు తమ పాత పీఎఫ్ అకౌంట్ నుంచి కొత్తదానికి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

దీనికి పేపర్ వర్క్ చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు, ఈపీఎఫ్ఓ దాదాపు 80 మిలియన్ల మంది ఖాతాదారులకు పర్మెనెంట్ రిలీఫ్ అందించనుంది. ఇందుకోసం కొత్త ‘ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్’ను ప్రవేశపెట్టింది. అతి త్వరలోనే ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది.

ఇక పాత ఆఫీసు చుట్టూ తిరగక్కర్లేదు :
ఈ కొత్త ఈఫీఎఫ్ఓ రూల్ అమల్లోకి వచ్చాక ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం ఇకపై ఆన్‌లైన్ క్లెయిమ్ లేదా అప్లికేషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సిస్టమ్ ప్రకారం.. ఒక ఉద్యోగి ఒక సంస్థను వదిలి మరొక సంస్థలో చేరినప్పుడు వారు పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ కోసం పాత కంపెనీపై ఆధారపడవలసి ఉంటుంది. కొన్నిసార్లు పాత కంపెనీ ఆమోదం ఆలస్యం చేయొచ్చు.

దాంతో ఆయా ఉద్యోగి డబ్బు విత్ డ్రా చేసుకోలేరు. కొత్త పీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఎంప్లాయిర్ జోక్యం ఇప్పుడు ఉండదు. మీరు కొత్త కంపెనీలో చేరిన వెంటనే సిస్టమ్ మీ పాత పీఎఫ్ బ్యాలెన్స్‌ను కొత్త ఖాతాకు ఆటోమాటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఆటోమేటెడ్ అవుతుంది. మీ పాత కంపెనీ క్లెయిమ్‌ను అప్రూవల్ చేసిందా లేదా అనేదానిపై ఆందోళన అవసరం లేదు.

Read Also : Best Triple Camera Phones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 30వేల లోపు బెస్ట్ 5 ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?

ఫారం-13తో పనిలేదు :
ఇప్పటివరకూ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కష్టంతో కూడుకున్నది. ఖాతాదారులు ‘ఫారం 13’ నింపి వెరిఫికేషన్ కోసం వారాల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు, టెక్నికల్ లోపాలు లేదా సరిపోలని డాక్యుమెంట్ల కారణంగా క్లెయిమ్‌లు కూడా రిజెక్ట్ అవుతాయి. తద్వారా సమయం వృధా అవుతుంది. తీవ్ర ఒత్తిడికి దారితీస్తుంది. కొత్త సిస్టమ్ ద్వారా ఎలాంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. గతంలో ట్రాన్స్‌ఫర్ కోసం నెలలు పట్టేది. ఇప్పుడు ఈ ప్రక్రియ కేవలం 3 రోజుల నుంచి 5 రోజుల్లో పూర్తవుతుంది.

రిటైర్మెంట్ సమయంలో మొత్తం డబ్బు :
ఈ ఆటోమేటిక్ సిస్టమ్ వల్ల అద్భుత ప్రయోజనం ఉంది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సమయంలో ఏదైనా ఆలస్యమైతే వడ్డీ విషయంలో కొన్నిసార్లు తప్పులు జరగొచ్చు. వడ్డీ కోల్పోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ కారణంగా
మీ డబ్బుపై వడ్డీని కోల్పోయే అవకాశం ఉండదు. మీ మొత్తం ఫండ్ సేఫ్‌గా ఒక చోట ఉంటుంది.