Toyota Land Cruiser Prado : ఆగస్టు 1న టయోటా సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Toyota Land Cruiser Prado : టయోటా సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో రెట్రో-రగ్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టు 1న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది.

Toyota Land Cruiser Prado : ఆగస్టు 1న టయోటా సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

New-gen Toyota Land Cruiser Prado debut on August 1

Updated On : July 29, 2023 / 11:01 PM IST

Toyota Land Cruiser Prado : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా (Toyoto) కొత్త 5వ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను వచ్చే ఆగస్ట్ 1న లాంచ్ చేయనుంది. SUV మొదటిసారిగా అమెరికాలో ల్యాండ్ క్రూయిజర్ పేరుతో ఆవిష్కరించనుంది. టయోటో మొదటిసారిగా ప్రాడో మోడల్ కారును ప్రవేశపెట్టనుంది. కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను లెక్సస్ బ్రాండెడ్ మాదిరిగా లెక్సస్ GX ఫీచర్లతో రానుంది.

లేటెస్ట్ అవతార్‌లో ప్రయోజనకరమైన, కఠినమైన డిజైన్‌ను అందించనుంది. ప్రాడో దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌లతో మెష్-టైప్ గ్రిల్‌తో వస్తుందని టయోటా ధృవీకరించింది. కిందిభాగంలో కఠినమైన స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉండనుంది. SUV ప్రొఫైల్‌లో బుచ్, స్క్వేర్డ్ డిజైన్‌ను అందించనుంది. లెక్సస్ జిఎక్స్ ప్రాడో మధ్య సారూప్యతలు ప్రధానంగా కాస్మెటిక్ మార్పులతో ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

Read Also : iPhone 15 Pro Models : రాబోయే ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఐఫోన్ 14 ప్రో కన్నా చాలా ఖరీదైనవి.. రూ.17వేలు ఎక్కువ ఉండొచ్చు..!

టయోటా కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో TNGA-F ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించింది. లెక్సస్ GXకి కూడా సపోర్టు అందిస్తుంది. కంపెనీ పవర్‌ట్రెయిన్‌లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనప్పటికీ లెక్సస్ GXతో అందించిన వాటితో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 349bhpతో 3.4-లీటర్ V6, అలాగే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లు, పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌లు ఉన్నాయి. AWDతో సామర్థ్యం గల ఆఫ్-రోడ్ సామర్థ్యం గల సస్పెన్షన్‌పై అందించనుంది.

New-gen Toyota Land Cruiser Prado debut on August 1

New-gen Toyota Land Cruiser Prado debut on August 1

GX ఓవర్‌ల్యాండ్ వేరియంట్‌తో లెక్సస్ మాదిరిగానే టయోటా ప్రాడోను హై-స్పెక్ ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వేరియంట్‌తో అందించవచ్చు. కొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉత్తర అమెరికా మార్కెట్లోకి వస్తుంది. అయితే, ల్యాండ్ క్రూయిజర్‌గా విక్రయించనుంది. ప్రాడో పైన కూర్చున్న ల్యాండ్ క్రూయిజర్ LC 300 అయితే మార్కెట్లోకి రాలేదు. ఈ బ్రాండ్ ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోను వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

Read Also : Hyundai Exter CNG : హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG ఐదో వంతు బుకింగ్స్.. ఏ వేరియంట్ ధర ఎంత ఉందంటే?