New Mobile Plans : ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. క్రికెట్ ప్లానపై భారీ డేటా, మరెన్నో కాలింగ్ బెనిఫిట్స్..!

New Mobile Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్.. ఈ కొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో డేటా, కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

New Mobile Plans (Photo : Google)

New Mobile Plans : టెలికం యూజర్లకు అలర్ట్.. దేశీయ ప్రముఖ టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్లకు అనేక సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone idea) వంటి టెలికోలు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ప్లాన్లను ప్రవేశపెట్టాయి. Airtel, Jio, Vodafone Idea ఇటీవల కొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను (Recharge Plans) ప్రారంభించాయి.

ఈ ప్లాన్లలో అనేక బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లతో డేటా, కాలింగ్ సహా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఈ కొత్త ప్లాన్‌లతో భారీ డేటా వాడే యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ అవసరమయ్యే యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రతి ఒక్కరికీ ఒక ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మీరు కొత్త రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా నుంచి లేటెస్ట్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి.

ఎయిర్‌టెల్ కొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ :
ఎయిర్‌టెల్ రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా ప్రతి యాడ్-ఆన్ ప్లాన్ పొందవచ్చు. మొత్తం 75GB + 30GB మొత్తం డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ 200GB వరకు డేటా అనుమతిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS మాత్రమే కాదు.. ఈ ప్లాన్ 6 నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ (Amazon Prime Membership), ఒక ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ (Disney+ Hotstar) సర్వీసును అందిస్తుంది.

జియో కొత్త క్రికెట్ ప్లాన్‌లు ఇవే :
రిలయన్స్ జియో రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 3GB రోజువారీ డేటా క్యాప్, 14 రోజుల పాటు (Jio Apps) యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. అదనంగా, జియో యూజర్లు రూ. 25 విలువైన 2GB డేటా-యాడ్-ఆన్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు. జియో వెల్‌కమ్ 5G ఆఫర్‌కు అర్హులైన వారు ఉచిత 5G డేటాను పొందవచ్చు.

New Mobile Plans (Photo : Google)

Read Also : Fake Websites Scam : ఆన్‌లైన్ స్కామర్లతో జాగ్రత్త.. డిమార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ పేర్లతో ఫేక్ వెబ్‌సైట్లు.. ఈ లింకులను క్లిక్ చేస్తే ఖతమే..!

జియో రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 28 రోజుల పాటు 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా, యూజర్లు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 61 విలువైన 6GB డేటా యాడ్-ఆన్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు.

జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 84 రోజుల పాటు 3GB రోజువారీ డేటా అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు Jio యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 5Gకి యాక్సెస్‌ను కలిగి ఉంటే.. లిమిటెడ్ పీరియడ్‌ వరకు ఉచితంగా రూ.241 విలువైన 40GB అదనపు డేటాను పొందవచ్చు.

వోడాఫోన్ ఐడియా కొత్త సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ :

వోడాఫోన్ (Vi) రూ. 289 ప్రీపెయిడ్ ప్లాన్ : VI కొత్త రూ. 289 ప్రీపెయిడ్ ప్లాన్‌తో.. మీరు తక్కువ ధరతో ఎక్కువ కాలం పాటు అన్‌లిమిటెడ్ ప్లాన్‌ని పొందవచ్చు. ఈ ప్లాన్ రోజుకు లిమిట్స్ లేకుండా మొత్తం 4GB డేటాతో 48 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 SMSలు ప్లాన్‌లో పొందవచ్చు.

Vi రూ. 429 ప్రీపెయిడ్ ప్లాన్ : వోడాఫోన్ ఐడియా రూ. 429 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 78 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 SMSలను పొందవచ్చు. వినియోగదారులు కాలింగ్, SMS బెనిఫిట్స్‌తో పాటు రోజువారీ లిమిట్ లేకుండా 6GB డేటాను కూడా పొందవచ్చు.

Read Also : Tecno Camon 20 Pro 4G : టెక్నో Camon 20 ప్రో 4G ఫోన్ వస్తోంది.. డిజైన్, కీలక ఫీచర్లు లీక్.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?