Telugu » Business » New Renault Duster 2026 Launched After Discontinued In 2022 Rival To Suv Market In India Sh
New Renault Duster : వావ్ వండర్‌ఫుల్.. కొత్త రెనాల్ట్ డస్టర్ రీఎంట్రీ.. SUV మార్కెట్ షేక్ అంతే.. హైబ్రిడ్ ఇంజిన్, సేఫ్టీ ఫీచర్లతో..!
New Renault Duster: 4 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత రెనాల్ట్ డస్టర్ SUV ఎట్టకేలకు భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కొత్త జనరేషన్ డస్టర్ మిడ్‌సైజ్ SUV విభాగంలో సంచలనం సృష్టించనుంది.
New Renault Duster: రెనాల్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారతీయ వాహనదారుల డ్రీమ్ కారు భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. మిడ్ సైజ్ SUV విభాగంలో ఈసారి కొత్త అవతార్‌లో రెనాల్ట్ డస్టర్ వచ్చేసింది. దాదాపు 4 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ డస్టర్ అత్యంత పాపులర్ మోడల్ కారు. ఊహించినట్లుగానే.. కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ అడ్వాన్స్ టెక్నాలజీ, సరికొత్త డిజైన్, ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
2/12
కొత్త పవర్ ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్ హైలెట్. ఎల్ఈడీ లైట్లు, స్పోర్టీ బంపర్లు, ప్రీమియం ఇంటీరియర్‌లు, సౌకర్యవంతమైన సీట్లు, బిగ్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. కొత్త డస్టర్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చిలో డెలివరీలు ప్రారంభమయ్యే ముందు ధర వెల్లడి కానుంది. కొత్త డస్టర్ కీలక ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
3/12
కొత్త రెనాల్ట్ డస్టర్ ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ రియర్ లైట్ బార్ కూడా ఉంది. 18-అంగుళాల అవుట్‌బ్యాక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ స్టైలిష్ లుక్ అందిస్తాయి. మౌంటైన్ జాడే గ్రీన్ ఎక్స్ ట్రనల్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ SUV రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ప్రత్యేకంగా భారతీయ మార్కెట్ కోసం రూపొందించగా 90శాతం స్పేర్ పార్ట్స్ భారత్ లో తయారైనవే.
4/12
రెనాల్ట్ డస్టర్ సేఫ్టీ ఫీచర్లు : కొత్త రెనాల్ట్ డస్టర్ మోడల్ అడ్వాన్స్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లేతో 10.1-అంగుళాల ఓపెన్ఆర్ లింక్ మల్టీమీడియా సిస్టమ్ అందిస్తుంది. 10.25-అంగుళాల TFT డ్రైవర్ డిస్‌ప్లే, మ్యాప్ రెప్లికేషన్ కూడా అందిస్తుంది. 17 అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది.
5/12
కొత్త డస్టర్ ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్‌గేట్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ డ్యూయల్-జోన్ ఏసీ, క్లీన్ ఎయిర్ AQI డిస్ప్లే (PM2.5 డిస్‌ప్లే), మల్టీ-సెన్స్ డ్రైవ్ మోడ్‌లతో 48 యాంబియంట్ లైటింగ్ కస్టమైజేషన్‌లు, 6-వే అడ్జస్ట్‌మెంట్‌తో ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, మాన్యువల్ లంబార్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేటెడ్ ఫంక్షన్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, రెనాల్ట్ హ్యాండ్స్‌ఫ్రీ యాక్సెస్ కార్డ్‌తో పుష్ స్టార్ట్, ఆటో-డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్, ఆటో అప్/డౌన్‌తో అన్ని పవర్ విండోస్, టచ్ యాక్టివేటెడ్ క్యాబిన్ లైటింగ్, 6-స్పీకర్ అర్కామిస్ ఆడిటోరియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది.
6/12
8గేర్లతో 80శాతం సిటీ డ్రైవింగ్ ఈవీ మోడ్ : పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. టర్బో TCe 160 ఇంజిన్ కొత్త టర్బోచార్జ్డ్ GDi ఇంజిన్, సెగ్మెంట్-లీడింగ్ పవర్, టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 163 PS పవర్, 280Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ E-టెక్ 160 1.8-లీటర్ ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. 1.4kWh బ్యాటరీతో వస్తుంది.
7/12
ఈ హైబ్రిడ్ సిస్టమ్ సిటీ డ్రైవింగ్‌లో 80 శాతం వరకు ఎలక్ట్రిక్-ఓన్లీ మోడ్‌లో రన్ అవుతుంది. పెట్రోల్‌ను ఆదా చేస్తుంది. టర్బో TCe 100 సరసమైన టర్బో-పెట్రోల్ ఆప్షన్. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ DHT ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దేశంలో అత్యంత పవర్ ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ అని కంపెనీ చెబుతోంది.
8/12
రెనాల్ట్ డస్టర్ కీలక ఫీచర్లు : కొత్త రెనాల్ట్ డస్టర్ కొన్ని ఫీచర్లను హైలైట్ చేసింది. ఈ SUV -23°C నుంచి 55°C వరకు తీవ్రమైన వాతావరణాలలో తట్టుకుంటుంది. 18,379 అడుగుల ఎత్తులో కూడా టెస్టింగ్ చేశారు. 5-స్టార్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రైవర్ కంటి నుంచి మల్టీమీడియా స్క్రీన్‌కు దూరం 502mm, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా చూడొచ్చు.
9/12
మల్టీమీడియా స్క్రీన్ 17.9° వ్యూ యాంగిల్ ఉంది. మీరు ఏ యాంగిల్ నుంచి అయినా స్క్రీన్‌ను హాయిగా చూడొచ్చు. ఈ కారు ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు కూడా అద్భుతమైన ఆప్షన్. మల్టీ-సెన్స్ డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. లగేజ్ కోసం తగినంత స్టోరేజీ పెట్టుకోవచ్చు.
10/12
కొత్త డస్టర్ బూట్ సామర్థ్యం 518 లీటర్లు (పార్శిల్ షెల్ఫ్ కింద), మీరు లగేజీని పైకప్పు వరకు స్టోర్ చేస్తే 700 లీటర్లకు పెరుగుతుంది. లోపల 32.6 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం కూడా ఉంది. కొత్త డస్టర్ సీట్ అప్హోల్స్టరీ, డ్యాష్‌బోర్డ్, డోర్ ఇన్సర్ట్‌లు రెనాల్ట్ లోగో మోడల్, కార్బన్ ఎండ్ మౌంటైన్ జాడే లెథరెట్‌తో వస్తుంది. రెనాల్ట్ ఇండియా కొత్త డస్టర్‌పై గరిష్టంగా 7 ఏళ్లు లేదా 150,000 కి.మీ వారంటీని అందిస్తోంది.
11/12
ధర, బుకింగ్, డెలివరీ : రెనాల్ట్ ఇండియా అధికారికంగా కొత్త రెనాల్ట్ డస్టర్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు తమ ఇళ్ల నుంచే కొత్త డస్టర్ కారును బుక్ చేసుకోవచ్చు. కంపెనీ కారు బుకింగ్ కోసం ఒక స్పెషల్ యాప్ కూడా అందిస్తోంది. బుకింగ్ చేసిన వెంటనే కస్టమర్లకు ఆర్-పాస్ లభిస్తుంది. కస్టమర్లు రూ. 21,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించాలి. కొత్త డస్టర్ ధరలను మార్చి మధ్యలో ప్రకటించనుంది. ఏప్రిల్ మధ్యలో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
12/12
దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు కొత్త డస్టర్ డెలివరీ చేయనుంది. టర్బో ఇంజిన్ వేరియంట్ డెలివరీలు ముందుగా ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. హైబ్రిడ్ వేరియంట్ డెలివరీల కోసం మాత్రం వినియోగదారులు దీపావళి వరకు వేచి ఉండాలి.