ఫోన్ పే వంటి యూపీఐలు వాడుతున్నారా? ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేస్తున్నారా? కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే..
మీ మొబైల్ నంబర్ ఏదైనా చాలా కాలంగా పనిచేయట్లేదా?

PhonePe
బ్యాంకులు, యూపీఐ విధానాల్లో ఏప్రిల్ 1 నుంచి అనేక మార్పులు రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పలు రూల్స్‌ను సవరించారు. పలు బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత నగదు విత్‌డ్రాల సంఖ్య తగ్గింది.
మీరు ఏ బ్యాంకులో ఖాతా ఉందో ఆ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం నుంచి కాకుండా ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి డబ్బులు విడ్‌డ్రా చేస్తే ఛార్జీ పడుతుంది. ఇప్పటివరకు మెట్రో నగరాల్లో ఐదు సార్లు ఎటువంటి ఛార్జీలు లేకుండా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇప్పటివరకు ఉంది.
ఏప్రిల్ 1 నుంచి మూడు విత్ డ్రాలకు మాత్రమే ఛార్జీలు వేయరు. ఆ లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 – రూ.25 ఛార్జీ పడుతుంది. అలాగే, మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్ ఎంత ఉండాలన్నది మీ ఖాతా టైప్, బ్యాంకు, బ్రాంచ్ అర్బన్/రూరల్ లొకేషన్‌ను బట్టి మారుతుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీలు వేస్తారు.
మరోవైపు, బ్యాంకు చెక్‌ల విషయంలోనూ కొత్త రూల్స్ తీసుకువస్తున్నారు. బ్యాంకుల్లో కస్టమర్ రూ.50 వేలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్‌ను ఎవరికైనా ఇస్తే.. అందులోని వివరాలను అతడు/ఆమె ఎలక్ట్రానికల్‌గా వెరిఫై చేయాలి. ఫ్రాడ్స్‌కు చెక్ చెప్పడానికి ఈ పీపీఎస్ విధానాన్ని తీసుకొస్తున్నారు.
బ్యాంకులు ఆన్‌లైన్ సర్వీస్‌లను కొత్త ఫీచర్లతో కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నాయి. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల కోసం టు ఫ్యాక్టర్ అథంటికేషన్‌తో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివాటిని మరింత సమర్థంగా అమలు చేయనున్నాయి.
దేశంలోని కొన్ని బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్స్, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లలో సవరణలు చేశాయి. వచ్చేనెల 1 నుంచి సేవింగ్స్ ఖాతాలోని బ్యాలెన్స్‌ను బట్టి మీకు వచ్చే వడ్డీ ఆధారపడి ఉంటుంది.
మీ మొబైల్ నంబర్ ఏదైనా చాలా కాలంగా పనిచేయట్లేదా? అది యూపీఐ ఖాతాలకు లింకై ఉందా? అటువంటి నంబర్లను రికార్డుల నుంచి బ్యాంకులు తొలగిస్తాయి. ఇక అటువంటి యూపీఐ ఖాతాలు వచ్చేనెల 1 నుంచి పని చేయకుండా పోతాయి.