Nothing Phone 2 : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ డోంట్ మిస్..!

Nothing Phone 2 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధరపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 2

Nothing Phone 2 : కొత్త నథింగ్ ఫోన్ కావాలా? వచ్చే జూలైలో నథింగ్ ఫోన్ 3 భారత మార్కెట్లోకి రాబోతుంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ (Nothing Phone 2) లాంచ్‌కు ముందే నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది.

బ్యాంక్ ఆఫర్లతో నథింగ్ ఫోన్ 2 మరింత తగ్గింపు ధరకే లభ్యమవుతోంది. సిగ్నేచర్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్, అమోల్డ్ ప్యానెల్, క్లీన్ యూఐ మరెన్నో ఫీచర్లను అందిస్తుంది. అసలు ధర రూ. 44,999 ఉండగా, అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..

Read Also : Property Registration : త్వరలో కొత్త చట్టం.. ఇకపై మీ ప్రాపర్టీని ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

నథింగ్ ఫోన్ 2 ధర ఎంతంటే? :
ప్రస్తుతం అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 రూ.44,999 నుంచి రూ.30,995కి లిస్టు అయింది. వినియోగదారులు ఫ్రీ కూపన్ ద్వారా ధరను రూ.750 తగ్గించవచ్చు. HDFC వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.2వేల బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. దాంతో ధర దాదాపు రూ.28,200కి తగ్గుతుంది.

ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.1,503 నుంచి ఈఎంఐలతో కూడా నథింగ్ ఫోన్ 2 కొనేసుకోవచ్చు. అలాగే, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.28,900 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఫుల్ ప్రొటెక్షన్, ఇతర యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2)లో 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల OLED ప్యానెల్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 4,700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP54 సర్టిఫికేషన్‌ కూడా పొందింది.

Read Also : Oppo Reno 12 : ఒప్పో రెనో 12పై దుమ్మురేపే డిస్కౌంట్.. భారీ తగ్గింపుతో ఈ ఫోన్ ఇలా కొనేసుకోండి.. డోంట్ మిస్..!

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ నథింగ్ ఫోన్ 50MP ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.