Nothing Phone 3 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్ సేల్‌కు ముందే నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్.. ఈ క్రేజీ డీల్ మీకోసమే..!

Nothing Phone 3 Price : అమెజాన్ ఆఫర్ అదిరింది. నథింగ్ ఫోన్ 3పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ సూపర్ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 3 Price

Nothing Phone 3 Price : కొత్త నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్‌లో నథింగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 రూ. 79,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు ధర భారీగా తగ్గింది.

ప్రస్తుతం ఈ నథింగ్ ఫోన్ రూ. 43,500 లోపు ధరకు (Nothing Phone 3 Price) అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (2) లాంచ్ ధర రూ. 44,999 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే.. నథింగ్ ఫోన్ 3 డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ :
ప్రస్తుతం ఈ నథింగ్ ఫోన్ (3) అసలు ధర రూ.44,789 ధర కన్నా రూ.35,210 తగ్గింది. అమెజాన్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఇన్‌స్టంట్ రూ.1,250 తగ్గింపు కూడా అందిస్తోంది. ప్రస్తుత ధర రూ.43,539కి చేరుకుంది. ఆసక్తిగల యూజర్లు పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.33,050 వరకు తగ్గింపుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో సహా నెలకు రూ.2,171 నుంచి ఈఎంఐ ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

Read Also : Samsung Galaxy Z Fold 6 5G : ఖతర్నాక్ ఆఫర్.. ఈ శాంసంగ్ మడతబెట్టే ఫోన్‌ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ HDR10+తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. హుడ్ కింద ఈ నథింగ్ ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.

గేమింగ్, మల్టీ టాస్కింగ్ యాప్‌ కోసం ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ నథింగ్ ఫోన్ 3 మోడల్ 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంది.