Okinawa Praise Scooter : 8 కొత్త కలర్లతో ఒకినావా ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్ చేస్తే 137కి.మీ వస్తుంది.. ధర ఎంతంటే?

Okinawa Praise Scooter : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వెహికల్ తయారీ ఒకినావా ఆటోటెక్ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌లో 8 కొత్త కలర్ ఆప్షన్లను యాడ్ చేసింది. ఇందులో ప్రైజ్ ప్రో, ఐప్రైజ్ ప్లస్ ఉన్నాయి.

Okinawa Praise electric scooter range gets 8 new colour options

Okinawa Praise Scooter : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వెహికల్ తయారీ ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌లో 8 కొత్త కలర్ ఆప్షన్లను యాడ్ చేసింది. ఇందులో ప్రైజ్ ప్రో, ఐప్రైజ్ ప్లస్ ఉన్నాయి. ప్రైజ్‌ప్రో ధర రూ. 99,645 (ఎక్స్-షోరూమ్), ఐప్రైస్ ప్లస్ ధర రూ. 1,45,965 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది.

Okinawa Praise Pro, Okinawa iPraise Plus కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ గ్రీన్, ఓషన్ బ్లూ, మావ్ పర్పుల్, లిక్విడ్ మెటల్, మిలిటరీ గ్రీన్, మోచా బ్రౌన్, సీఫోమ్ గ్రీన్ సన్ ఆరెంజ్ ఉన్నాయి. ఒకినావా ప్రైజ్ ప్రో 2.08 kWh లిథియం-అయాన్ డిటాచబుల్ బ్యాటరీని 3-4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయగలదు. గరిష్ట స్పీడ్ 56kmph, రన్నింగ్ ధర 14 పైసలు/కిమీ, అన్ని LED లైట్లు, E-ABS (ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ వ్యవస్థ) కలిగి ఉంది.

Read Also : iOS 16.4 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం iOS 16.4 అప్‌డేట్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

ఒకినావా iPraise Plus స్కూటర్ 3.6kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీని బయటకు తీయొచ్చు. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 137కిమీల వరకు వస్తుంది. ఇటీవలే 250,000 యూనిట్ల విక్రయ మైలురాయిని కంపెనీ అధిగమించింది. తద్వారా ఫస్ట్ డివైజ్ తయారీదారు (OEM)గా అవతరించింది. యూనిట్ ప్రైజ్ ప్రో.. రాజస్థాన్‌లోని కంపెనీ తయారీ ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ చేయడంతో 250,000వ మైలురాయి చేరుకుంది.

Okinawa Praise electric scooter range gets 8 new colour options

ఒకినావా 2025 నాటికి వాల్యూమ్‌లలో 1,000,000 యూనిట్లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైస్ ప్రో, ఐప్రైస్ ప్లస్ కాకుండా.. కంపెనీ Okhi-90, Dual 100, Ridge 100, Ridge+ వంటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తుంది. స్లో-స్పీడ్ ద్విచక్ర వాహనాలలో R30 లైట్ ఉన్నాయి. రూ. 10వేల కోట్ల FAME II స్కీమ్ కింద సబ్సిడీలను దుర్వినియోగం చేశారంటూ విచారణ జరుగుతున్న 12 కంపెనీల్లో ఒకినావా కూడా ఉంది.

ఇతర 11 కంపెనీలు హీరో ఎలక్ట్రిక్, బెన్లింగ్ ఇండియా, ఒకాయా EV, జితేంద్ర న్యూ EV టెక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (గతంలో ఆంపియర్ వెహికల్స్), రివోల్ట్ ఇంటెలికార్ప్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ, అవాన్ సైకిల్స్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, థుక్రాల్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్స్, వికిల్ వెహికల్స్ ఉన్నాయి.

Read Also : Tech Tips in Telugu : ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్ చేయడం తెలుసా? UAN ఎలా యాక్టివేట్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!