Ola Electric : ఈవీ 2W విభాగంలో తిరుగులేని ఆధిపత్యం.. జూన్‌లో 40 శాతం వాటాతో అగ్రగామిగా ఓలా ఎలక్ట్రిక్..!

Ola Electric : ఓలా ఈవీ 2W విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత జూన్‌లో దేశ ఈవీ మార్కెట్ వాటాను 40శాతంతో సుస్థిరం చేసుకుంది.

Ola maintains dominance in EV 2W segment, consolidates market share to 40 Percent in June

Ola Electric : భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశ మార్కెట్లో EV 2W (ఎలక్ట్రానిక్ టూ వీలర్) విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత జూన్ నెలలో 40శాతం మార్కెట్ వాటాతో ఓలా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సబ్సిడీ తగ్గింపుతో మొత్తం ఈవీ ఇండస్ట్రీ అమ్మకాలు క్షీణించగా.. ఓలా ఎలక్ట్రానిక్ జూన్‌లో దాదాపు 18వేల యూనిట్లను నమోదు చేసింది. వాహన్ డేటా ప్రకారం.. భారత ఈవీ టూ వీలర్ సెక్టార్‌లో ఓలా అగ్రగామిగా నిలిచింది.

Read Also : Ola Electric Scooter Offer : ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ వడ్డీ రేటుకే ఓలా స్కూటర్.. ఇప్పుడే కొనేసుకోండి!

ఓలా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘ఓలా మార్కెట్ వాటాను విస్తరించడంలో విజయవంతమైంది. జూన్‌లో పరిశ్రమ మందకొడిగా కొనసాగినప్పటికీ.. అద్భుతమైన రీతిలో అమ్మకాలను నిర్వహించింది. వ్యయ నిర్మాణాలు, సరఫరా గొలుసుతో పాటు పటిష్టమైన ఇన్-హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటివి సబ్సిడీ తగ్గింపు ప్రభావాన్ని కొనసాగించాయి. తద్వారా ఓలా ప్రొడక్టుల ధరలను అత్యంత పోటీతత్వాన్ని పెంచాయి. ఈ జూలైలో S1 ఎయిర్‌తో రాబోయే పోర్ట్‌ఫోలియో విస్తరణపై ఆసక్తిగా ఉన్నాం. ఈవీలను మరింత యాక్సెస్ చేయగలదని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

Ola maintains dominance in EV 2W segment, consolidates market share to 40 Percent in June

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (EC) వేగంగా ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే ఓలా 750వ ECని ప్రారంభించింది. వచ్చే ఆగస్టు నాటికి వెయ్యి ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల (EC)కు మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే 90శాతం ఓలా కస్టమర్‌లకు అనుకూలమైన ప్రదేశంలో అనేక రకాల సేవలను అందిస్తాయి.

ఈవీ విప్లవంలో భాగంగా దేశంలోని 2W విభాగంలో ఓలా S1 స్కూటర్లతో మార్కెట్ వాటను మరింత విస్తరించనుంది. సవరించిన సబ్సిడీలు జూన్ నుంచి అమల్లోకి రావడంతో ఓలా S1 Pro ధర రూ. 1,39,999, S1 (3KWh) రూ. 1,29,999, S1 Air (3KWh) ధర రూ. 1,09,999లకు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Ola Electric GigaFactory : ఓలా ఎలక్ట్రిక్ భారతీయ అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలైందోచ్.. దేశంలో ఎక్కడ? కార్యకలాపాలు ఎప్పుడంటే?