Ola Electric Scooter Offer : ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ వడ్డీ రేటుకే ఓలా స్కూటర్.. ఇప్పుడే కొనేసుకోండి!

Ola Electric Scooter Offer : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అత్యంత తక్కువ వడ్డీ రేటుకే కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల వ్యవధితో తక్కువ వడ్డీ రేటుకే అందిస్తోంది.

Ola Electric Scooter Offer : ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ వడ్డీ రేటుకే ఓలా స్కూటర్.. ఇప్పుడే కొనేసుకోండి!

Ola Electric Offers Lucrative Financing Options, Check Full Details

Updated On : June 16, 2023 / 7:36 PM IST

Ola Electric Scooter Offer : భారత అతిపెద్ద ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫైనాన్స్ కింద ఓలా ఈవీ స్కూటర్ కొనుగోలు చేసేవారికి ఇదే సరైన అవకాశం. దేశ ఈవీ మార్కెట్లో 2W సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఓలా S1 స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ అనుగుణంగా (#EndICEAge) ఓలా తమ వినియోగదారుల కోసం లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టింది.

ప్రత్యేకించి (IDFC First Bank), L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌, ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తోంది. తద్వారా జీరో (Zero Down Payment) డౌన్ పేమెంట్‌తో 60 నెలల వ్యవధిలో కేవలం 6.99 శాతం వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఓలా అందించే అత్యంత తక్కువ నెలవారీ ఈఎంఐ (EMI)తో జీరో డౌన్ పేమెంట్‌ వెసులుబాటు కల్పిస్తోంది.

Read Also : Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ కొత్త బిగ్ టీవీ సేల్.. ఉచితంగా గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్, స్మార్ట్‌టీవీలపై రూ. 20వేల వరకు క్యాష్‌బ్యాక్..!

దేశ ఈవీ మార్కెట్లలో నెంబర్‌వన్ స్థానంలో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అనే ఫైనాన్సింగ్ పార్టనర్లతో టైర్ 1, టైర్ 2, టైర్ 3 వంటి నగరాల్లోనూ చౌకైన వడ్డీ రేట్లతో ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తుందని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ పేర్కొన్నారు.

Ola Electric Offers Lucrative Financing Options, Check Full Details

Ola Electric Scooter Offer Lucrative Financing Options, Check Full Details

భారత మార్కెట్లో ఈవీ టూ వీలర్ (2W) సెగ్మెంట్‌లో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పారు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్లతో ఈవీ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు అయ్యే ఖర్చు.. ఇతర వెహికల్ కొనేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే అందులో సగమే ఉంటుందని అగర్వాల్ చెప్పారు.

ఓలా యాప్ ద్వారా ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్ల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్‌ను ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌లో కూడా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఓలా S1 Pro, S1, S1 Air వెహికల్‌తో కూడిన S1 లైనప్ అత్యాధునిక సాంకేతికతతో వరుసగా మూడు త్రైమాసికాలుగా 2W EV విభాగంలో అమ్మకాల్లో కంపెనీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!