Ola S1 Air Teaser Video : ఓలా టీజర్ అదిరింది.. అత్యంత సరసమైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వస్తోంది.. గంటకు 90 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది..!
Ola S1 Air Teaser Video : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా S1 ఎయిర్ ఈవీ స్కూటర్‌కు సంబంధించి సరికొత్త టీజర్ వచ్చేసింది. లాంచ్‌కు ముందే ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ola S1 Air Teaser video out _ Ola’s most affordable electric scooter launching soon
Ola S1 Air Teaser Video : భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్, ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేస్తోంది. రాబోయే అత్యంత సరసమైన స్కూటర్ (Ola S1 Air)కు సంబంధించి కంపెనీ సరికొత్త టీజర్‌ను రిలీజ్ చేసింది. ఆగస్టు నెలలో ఓలా S1 ఎయిర్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించనుంది. అంతకన్నా ముందు ఓలా S1 ఎయిర్ కోసం సరికొత్త టీజర్‌ను లాంచ్ చేసింది. ఈ ఈవీ స్కూటర్ మన్నికను చెక్ చేసేందుకు కఠినమైన టెస్టులను కూడా టీజర్ ద్వారా చూపించింది.
ఈ కొత్త S1 ఎయిర్ స్కూటర్‌ను ప్రస్తుత కస్టమర్ల నుంచి సేకరించిన అన్ని అభిప్రాయాల ఆధారంగా రూపొందించినట్టు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. సరికొత్త Ola S1 ఎయిర్ టీజర్ వీడియోను ఓలా ఎలక్ట్రిక్ ట్విట్టర్‌లో ‘The versatile Ola S1 Air’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. 500,000 కి.మీ.కి పైగా టెస్టింగ్ చేసినట్టు తెలిపింది. వేగంగా దూసుకెళ్లు.. ప్రతి రైడ్‌ను జాయ్‌రైడ్‌గా మార్చుకో (#EndICEAge) అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేసింది. కొండ ప్రాంతంలో కొన్ని బ్యూటీ షాట్‌లతో ఈ ఓలా స్కూటర్ టీజర్ ప్రారంభమవుతుంది.
బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ఓవర్‌లో ఇప్పుడు ఇష్టపడే ఈ స్కూటర్‌ని రూపొందించడానికి కంపెనీ ఎంతగానో కృషి చేసిందని వినిపిస్తుంది. స్కూటర్‌ను పరిమితిని టెస్టింగ్ చేసేందుకు కఠినమైన పర్వత రహదారులు, వంపు తిరిగిన బ్యాంకింగ్ రోడ్‌లతో సహా వివిధ భూభాగాల్లో కఠినంగా పరీక్షించినట్లు పేర్కొంది. 5 లక్షల కిలోమీటర్ల వరకు పరీక్షించిన తర్వాత మన్నికను ప్రదర్శించనుంది. ఈ ఛాలెంజింగ్ టెర్రైన్‌ల గుండా స్కూటర్‌ని నడపడాన్ని టీజర్‌లో చూడవచ్చు.

Ola S1 Air Teaser video out _ Ola’s most affordable electric scooter launching soon
ఓలా S1 ఎయిర్ ధర, స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఇప్పుడు, రాబోయే Ola ఎలక్ట్రిక్ S1 ఎయిర్ ధర, స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. కంపెనీ ప్రస్తుతం రూ. 999 బుకింగ్ అమౌంట్‌తో మోడల్‌కు రిజర్వేషన్‌లను అంగీకరిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. స్కూటర్ ప్రారంభ ధరను రూ. 1,09,999గా ఖరారు చేసింది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కి.మీ. వేగంతో, 4.5 కిలోవాట్ల గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌తో అందించనుంది. 34L బూట్ స్పేస్, కొత్తగా డిజైన్ చేసిన రియర్ గ్రాబ్ హ్యాండిల్‌ను కలిగి ఉంటుందని అంచనా. రాబోయే S1 ఎయిర్‌లో మీ స్కూటర్‌ని రిమోట్‌గా అన్‌లాక్ చేసేందుకు ఉపయోగించే డిజిటల్ కీ, డిజిటల్ నావిగేషన్, మ్యూజిక్ ప్లేయింగ్ సామర్థ్యాలు వంటి టెక్నికల్ ఫీచర్లు కూడా ఉంటాయి. Ola S1 Pro మోడల్ విపరీతమైన ప్రజాదరణను పొందాయి.

Ola S1 Air Teaser video out _ Ola’s most affordable electric scooter launching soon
స్కూటర్ హబ్ మోటారుతో పవర్ అందిస్తుంది. 125 కిలోమీటర్ల IDC పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా, హైపర్-మోడ్ యాక్సిలరేషన్‌ను కలిగి ఉంటుంది. 2.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గంట, 4.5 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ/గం వేగాన్ని ఎనేబుల్ చేస్తుంది. కొన్ని వారాల క్రితమే (Ola Electric) ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ (YouTube)లో S1 ఎయిర్ మరో వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో (Ola Electric) వద్ద స్ట్రాటజీ హెడ్ అయిన (Slokarth Dash) ప్రశ్నలకు సమాధానమిస్తూ.. కొత్త (Ola Electric S1 Air)ని మొదటిసారిగా రోడ్డుపై ప్రదర్శించారు. స్ట్రాటజీ హెడ్, కొత్త S1 ఎయిర్‌ని పరిచయం చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. దానిని అనుసరించి పర్ఫార్మెన్స్, థొరెటల్ గురించి కొన్ని ప్రశ్నలకు ఓలా సమాధానమిచ్చింది.
S1 ఎయిర్ డెవలప్‌మెంట్‌పై చాలా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుత కస్టమర్ల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించినట్టు చెప్పారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ కొత్త ఈవీ స్కూటర్‌లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. కస్టమర్ వినియోగం, సౌలభ్యం, బటన్ ఆపరేషన్, గ్రాబ్ రైల్ ఎక్స్‌పీరియన్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ ఆవశ్యకత గురించి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా Ola S1 ఎయిర్ మెరుగుపరిచినట్టు స్లోకార్త్ పేర్కొన్నారు. కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త స్కూటర్ హ్యాండ్లింగ్, పెర్ఫార్మెన్స్, ఎర్గోనామిక్స్ పరంగా రూపొందించామని ఓలా పేర్కొంది.
జూలై 28 నుంచి బుక్ చేసుకోవచ్చు
S1 ఎయిర్ కొనుగోలు విండోను జూలై 28న ప్రారంభించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ పరిమిత వ్యవధి కొనుగోలు విండో జూలై 28 నుండి జూలై 30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ సమయంలో బుక్
చేసుకున్న వారికి INR 1,09,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 31వ తేదీ నుంచి బుక్ చేసుకునే వారికి INR 1,19,999కి సవరించిన ధరతో ప్రారంభమవుతుంది. ఆగస్టు ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.
Read Also : Google Warn Users : మీరు ఈ పని చేయకపోతే.. మీ జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు డిలీట్ అవుతాయి జాగ్రత్త..!