OnePlus 11R 5G Launch : సోలార్ రెడ్ వేరియంట్‌తో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

OnePlus 11R 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు వివరాలను ఓసారి లుక్కేయండి.

OnePlus 11R 5G Launch : సోలార్ రెడ్ వేరియంట్‌తో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

OnePlus 11R 5G Solar Red Variant With 8GB RAM, 128GB Storage

OnePlus 11R 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో వన్‌‌ప్లస్ 11ఆర్ 5జీ సోలార్ రెడ్ వేరియంట్ పేరుతో లాంచ్ అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్ఓసీ, కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.

Read Also : Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ బ్యాన్ వర్కౌట్ అయింది.. కొత్తగా చేరిన 9.33 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు..!

గత ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ లాంచ్ అయింది. ఆ తర్వాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కొత్త సోలార్ రెడ్ ఫినిష్‌ను ప్రకటించింది. ఈ కలర్ ఆప్షన్ ఫోన్ అత్యధిక 18జీబీ+ 512జీబీ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఇప్పుడు, వన్‌ప్లస్ భారత్‌లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ సోలార్ రెడ్ కలర్ వేరియంట్‌ను బేస్ 8జీబీ ర్యా,మ్ 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వచ్చింది. అయితే, ప్రస్తుతం కలర్ వేరియంట్‌ల కన్నా ధర ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో వన్‌‌ప్లస్ 11ఆర్ 5జీ ధర ఎంతంటే?:
వన్‌‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ బేస్ 8జీబీ ర్యామ్+128జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ సోలార్ రెడ్ కలర్‌లో రూ.35,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ లాంచ్ కాగా.. భారత్‌లో గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ వేరియంట్‌లతో పాటు కొత్త వెర్షన్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్ ధర రూ. 32,999కు పొందవచ్చు. గత ఏడాది అక్టోబర్‌లో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ సోలార్ రెడ్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. కానీ, హై-ఎండ్ 18జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్‌ అందిస్తుంది. ఈ వేరియంట్ ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు.

వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ 6.74-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+(1,240×2,772) కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను 40హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 1000హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 100డబ్ల్యూ సూపర్‌‌వూక్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Read Also : Vivo Y200i Launch : 50ఎంపీ రియర్ కెమెరాతో వివో Y200i ఫోన్ లాంచ్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!