OnePlus 16 Release : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. వన్‌ప్లస్ 15s లాంచ్ లేనట్టే.. వన్‌ప్లస్ 16పై కీలక అప్డేట్..!
OnePlus 16 Release : వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఈసారి నిరాశే.. గ్లోబల్ సహా భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 15s, వన్ ప్లస్ 16 ఫోన్లు లాంచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. పూర్తి వివరాలివే..
OnePlus 16 Release
- వన్‌ప్లస్ పలు మార్కెట్లలో కార్యకలాపాలను తగ్గిస్తున్నట్టు సమాచారం
- వన్‌ప్లస్ 16 లాంచ్ సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు
- వన్‌ప్లస్ 15sను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం లేనట్టే
OnePlus 16 Release : వన్‌ప్లస్ లవర్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్.. వన్‌ప్లస్ 15s లాంచ్ ఇప్పట్లో లేనట్టే.. ఈ ఏడాది మొదట్లో కంపెనీ చైనాలో వన్‌ప్లస్ 15T ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ 15sగా లాంచ్ చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడు వన్‌ప్లస్ 15s లాంచ్ చేయడంపై సందిగ్ధత నెలకొంది. వన్‌ప్లస్ 15Tలో 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 7500mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ 15s కూడా (OnePlus 16 Release) ఇలాంటి స్పెసిఫికేషన్లతోనే వస్తుందని భావిస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ సంబంధించి భారీ అప్డేట్ రాబోతోంది. టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ 15s ఫోన్ గ్లోబల్ లాంచ్ వాయిదా పడవచ్చు. వన్‌ప్లస్ 15sను గ్లోబల్ మార్కెట్లో కంపెనీ లాంచ్ చేయదని చెబుతున్నారు.
వన్‌ప్లస్ 16 లాంచ్ కీలక అప్డేట్.. :
వన్‌ప్లస్ 16 లాంచ్ సంబంధించి కూడా కీలక అప్డేట్ వచ్చింది. భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు. వాస్తవానికి, పలు మార్కెట్లలో వన్‌ప్లస్ తమ యాక్టివిటిస్ క్రమంగా తగ్గిస్తోందని అంటున్నారు. కానీ, కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఇటీవలే వన్‌ప్లస్ N6 టీజర్ రిలీజ్ అయింది. అందులో భారీ 8000mAh బ్యాటరీతో వస్తున్నట్టు సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రాసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఆర్ఎమ్ మాలి-G57 ఎంసీ2 జీపీయూ ఉండవచ్చు.
గీక్‌బెంచ్‌లో వన్‌ప్లస్ N6 సింగిల్-కోర్ టెస్ట్‌లో 788 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 1,993 పాయింట్లు సాధించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 30న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ N6లో 8,000mAh బ్యాటరీ ఉంటుంది.
గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తుంది. అయితే, వన్‌ప్లస్ 15s కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే.. కంపెనీ దీనిపై ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
