OnePlus Ace 5 Series : వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చే నెలలోనే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
OnePlus Ace 5 Series : వన్‌ప్లస్ చైనా హెడ్ లూయిస్ లీ వెయిబో పోస్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5ప్రో డిసెంబర్‌లో చైనాలో లాంచ్ కానుంది. కచ్చితమైన ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించలేదు.

OnePlus Ace 5 And Pro Launch Set for December
OnePlus Ace 5 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లో వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ Ace 5 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో బేస్ వన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5 ప్రో వేరియంట్ ఉన్నాయి.
రాబోయే ఈ ఫోన్‌కు సంబంధించి చిప్‌సెట్ వివరాలతో పాటు స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ సీనియర్ అధికారి ధృవీకరించారు. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ స్పెసిఫికేషన్‌లతో సహా హ్యాండ్‌సెట్‌ల అనేక ముఖ్య ఫీచర్లు గతంలోనే రివీల్ అయ్యాయి. రాబోయే ఫోన్‌లు వన్‌ప్లస్ ఏస్ 3, వన్‌ప్లస్ ఏస్ 3ప్రో వివరాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
వన్‌ప్లస్ చైనా హెడ్ లూయిస్ లీ వెయిబో పోస్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ ఏస్ 5, ఏస్ 5ప్రో డిసెంబర్‌లో చైనాలో లాంచ్ కానుంది. కచ్చితమైన ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించలేదు. ప్రో వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
బేస్ వన్‌ప్లస్ ఏస్ 5 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీతో వస్తుందని వెల్లడించింది. హ్యాండ్‌సెట్‌ల కన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ వన్ ప్లస్ 8జనరేషన్ 3 స్నాప్‌డ్రాగన్ 8 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా, వన్‌ప్లస్ ఏస్ 5 లైనప్ జనవరి 2025లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాబోతోంది. వన్‌ప్లస్ 13ఆర్ మోనికర్‌తో వనిల్లా వన్‌ప్లస్ ఏస్ 5 భారత్ సహా చైనా వెలుపలి మార్కెట్‌లలో లాంచ్ చేయవచ్చు.
వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ ఫీచర్లు (అంచనా) :
వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 1.5కె రిజల్యూషన్‌తో బీఓఈ ఎక్స్2 8టీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేలతో వస్తాయని భావిస్తున్నారు. బేస్ వేరియంట్ 6.78-అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. ఫోన్‌లు అలర్ట్ స్లైడర్‌తో అమర్చి ఉంటాయి. 100డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తాయి. వనిల్లా వన్‌ప్లస్ ఏస్ 5 6,300mAh బ్యాటరీని పొందవచ్చు. ఇందులో ప్రో వేరియంట్ 6,500mAh సెల్‌ను కలిగి ఉంటుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లు 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. వనిల్లా వెర్షన్‌లో 16ఎంపీ సెల్ఫీ షూటర్ ఉండవచ్చు. వన్‌ప్లస్ Ace 5 సిరీస్ ఫోన్‌లు మెటల్ మిడిల్ ఫ్రేమ్, సిరామిక్ బ్యాక్ ప్యానెల్‌లను కలిగి ఉండవచ్చు. వన్‌ప్లస్ ఏస్ 3 మోడల్‌ల మాదిరిగానే కెమెరా మాడ్యూల్ డిజైన్‌లను పొందాలని భావిస్తున్నారు. రాబోయే హ్యాండ్‌సెట్‌లు 24జీబీ వరకు ర్యామ్‌ను అందజేస్తాయి.
Read Also : iPhone 17 Pro Models : స్పెషల్ కెమెరా ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?