OnePlus Diwali Sale : వన్‌ప్లస్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఇలాంటి డీల్స్ అసలు మిస్ చేయొద్దు..!
OnePlus Diwali Sale 2025 : వన్‌ప్లస్ దీపావళి సేల్ సమయంలో వన్‌ప్లస్ 13, 13R, నార్డ్ 5, నార్డ్ సీఈ5 ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

OnePlus Diwali Sale 2025
OnePlus Diwali Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? దీపావళి పండుగ వస్తోంది. చైనీస్ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ దీపావళి సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, టాబ్లెట్‌లపై కొన్ని అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. వన్‌ప్లస్ దీపావళి సేల్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్లలో వైడ్ రేంజ్ (OnePlus Diwali Sale 2025) ఆఫర్లను అందిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు (Amazon.in), రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కూడా ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్ :
వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.69,999 ధరకు లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 పండుగ ధర రూ.61,999కు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో ధర రూ.35,749కు తగ్గవచ్చు. వన్‌ప్లస్ 13s ధర రూ.50,999కు తగ్గుతుంది. అదనపు బ్యాంక్ ఆఫర్‌తో రూ.47,749కు తగ్గింపు పొందవచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ల కోసం వన్‌ప్లస్ నార్డ్ 5 డిస్కౌంట్ల తర్వాత రూ.28,999కు పొందవచ్చు. అయితే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ5 ధర రూ.21,999కు తగ్గుతుంది.
వన్‌ప్లస్ ఆడియో ప్రొడక్టులపై బెస్ట్ డీల్స్ :
వన్‌ప్లస్ ఆడియో అప్లియన్సెస్ కూడా అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ధర రూ.11,999, బ్యాంక్ డిస్కౌంట్ల తర్వాత కేవలం రూ.7,999కి తగ్గింది. వన్‌ప్లస్ బడ్స్ 4 ధర రూ.4,799కి అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ సరసమైన నార్డ్ బడ్స్ 3, వన్‌ప్లస్ నార్డ్ 3R వరుసగా రూ.1,599, రూ.1,499కి కొనుగోలు చేయవచ్చు. బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 ధర రూ.1,149కి తగ్గింది. బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ఎఎన్‌సీ ధర రూ.1,499కి అందుబాటులో ఉంది. క్వాలిటీ సౌండ్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.
వన్‌ప్లస్ టాబ్లెట్లపై బెస్ట్ డీల్స్ :
వన్‌ప్లస్ ప్యాడ్ 2 డిస్కౌంట్ల తర్వాత రూ.29,999 నుంచి లభ్యమవుతుంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ వరుసగా రూ.13,999, రూ.11,999కు కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం మోడల్ వన్‌ప్లస్ ప్యాడ్ 3 కూడా ధర తగ్గింది. వన్‌ప్లస్ టాబ్లెట్లపై ధర రూ.42,999 నుంచి కొనుగోలు చేయొచ్చు.