BSNL Diwali Bonanza : BSNL దీపావళి స్పెషల్ ఆఫర్.. జస్ట్ రూ. 1కే సిమ్ కార్డు.. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. 30 రోజులు ఎంజాయ్..!

BSNL Diwali Bonanza : బీఎస్ఎన్ఎల్ స్పెషల్ దీపావళి ఆఫర్ అందిస్తోంది. 30 రోజుల వరకు వ్యాలిడిటీతో నవంబర్ 15 వరకు కేవలం ఒక రూపాయి ధరకే పొందవచ్చు.

BSNL Diwali Bonanza : BSNL దీపావళి స్పెషల్ ఆఫర్.. జస్ట్ రూ. 1కే సిమ్ కార్డు.. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. 30 రోజులు ఎంజాయ్..!

BSNL Diwali Bonanza

Updated On : October 16, 2025 / 1:03 PM IST

BSNL Diwali Bonanza : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ పండగ ఆఫర్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో కొత్తగా చేరే యూజర్లు కేవలం ఒక రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS బెనిఫిట్స్ పొందవచ్చు.

అంతేకాదు.. కంపెనీ ఫ్రీ సిమ్ కార్డును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త యూజర్ల కోసం (BSNL Diwali Bonanza) మాత్రమే. మీరు ఎయిర్‌టెల్ లేదా జియో యూజర్ అయితే.. బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే ఇప్పుడే ఈ కొత్త ఆఫర్ ఎంచుకోండి. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

లిమిటెడ్ టైమ్ ఆఫర్ :
బీఎస్ఎన్ఎల్ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే. అక్టోబర్ 15న ప్రారంభమైన ఈ కొత్త ఆఫర్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకునే వినియోగదారులు ఎవరైనా కేవలం ఒక రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు.

ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లకు కంపెనీ ఫ్రీ సిమ్‌ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. మీరు కేవలం ఒక రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ 30 రోజులు పాటు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత, మీరు ఏదైనా రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా మీ సర్వీసును పొడిగించుకోవచ్చు.

Read Also : Samsung Galaxy M36 5G : బిగ్గెస్ట్ దీపావళి ఆఫర్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా :
ఈ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజాగా ప్రకటించింది. అయితే, కొన్ని నెలల క్రితమే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. ఆ సమయంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ 4G మొబైల్ నెట్‌వర్క్ ఇంకా భారత టెలికం మార్కెట్లో ప్రారంభం కాలేదు. ఇప్పుడు, దేశవ్యాప్తంగా దాదాపు 98వేల టవర్లతో బీఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ 4G మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే దీపావళి బొనాంజా ఆఫర్‌ పొందవచ్చు.

నంబర్‌ పోర్ట్ తర్వాత కూడా ఆఫర్ వర్తిస్తుందా? :
ఇతర టెలికం యూజర్లు తమ నంబర్లను బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో బీఎస్ఎన్ఎల్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ కొత్త యూజర్లకు మాత్రమేనని గమనించాలి. అయితే, ఒక కస్టమర్ ఫస్ట్ టైం బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటే ఆఫర్ బెనిఫిట్స్ పొందవచ్చు.

గత కొన్ని నెలలుగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడంతో బీఎస్ఎన్ఎల్ ఎయిర్‌టెల్‌ను అధిగమించిందని ట్రాయ్ డేటా చూపిస్తుంది. రాబోయే నెలల్లో ప్రభుత్వ సంస్థ 5G సర్వీసులు కూడా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.