OnePlus Monitors Sale : వన్‌ప్లస్ మానిటర్ E27, E24 సేల్ మొదలైందోచ్.. అదిరే ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

OnePlus Monitors Sale : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్‌ (OnePlus) స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అదిరే ఆఫర్లను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైడ్ రేంజ్ ప్రీమియం, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్న వన్‌ప్లస్ PC యాక్ససరీస్ మార్కెట్లోను అడుగుపెట్టింది.

OnePlus Monitors Sale : వన్‌ప్లస్ మానిటర్ E27, E24 సేల్ మొదలైందోచ్.. అదిరే ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

OnePlus Monitors Sale : OnePlus Monitor E 24, Monitor X 27 Available For Sale In India; Price, Offers, And Specifications

Updated On : February 16, 2023 / 6:31 PM IST

OnePlus Monitors Sale : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్‌ (OnePlus) స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అదిరే ఆఫర్లను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైడ్ రేంజ్ ప్రీమియం, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్న వన్‌ప్లస్ PC యాక్ససరీస్ మార్కెట్లోను అడుగుపెట్టింది. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ కస్టమర్ల కోసం వన్‌ప్లస్ భారత మార్కెట్లో హై-ఎండ్ రేంజ్‌లో ప్రొడక్ట్స్‌ను ప్రవేశపెట్టింది. వన్‌ప్లస్ మానిటర్ E24, వన్‌ప్లస్ మానిటర్ X27 కొత్త మానిటర్లను అందిస్తోంది. ఈ రెండు మానిటర్లకు సంబంధించి భారత మార్కెట్లో సేల్స్ మొదలయ్యాయి. ఈ మానిటర్స్ ధరలు, స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో ఈ రెండు కొత్త వన్‌ప్లస్ మానిటర్లకు సంబంధించి ఫస్ట్ సేల్ మొదలైంది. అందులో వన్‌ప్లస్ మానిటర్ E24 మోడల్ బడ్జెట్ రేంజ్‌లో అందిస్తోంది. ఈ డివైజ్ ధర రూ.11,999గా ఉంది. మిడ్ రేంజ్‌లో వచ్చిన వన్‌ప్లస్ మానిటర్ X27 ధర రూ.27,999గా ఉంది. ఈ రెండింటిపై ఈ-కామర్స్ సైట్లలో నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందిస్తోంది. ఈ మానిటర్స్ OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్ (Amazon Sale), ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale), వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

OnePlus Monitors Sale : OnePlus Monitor E 24, Monitor X 27 Available For Sale In India; Price, Offers, And Specifications

OnePlus Monitors Sale : OnePlus Monitor E 24, Monitor X 27 Available For Sale In India

Read Also : Honda City 2023 Bookings : కొత్త కారు కొంటున్నారా? హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

OnePlus Monitor E 24 – Monitor X 27 Features :
వన్‌ప్లస్ మానిటర్ E24 స్టాండర్డ్ వేరియంట్ మోడల్ Full HD డిస్‌ప్లేతో వచ్చింది. 16.7 మిలియన్ లైఫ్- లైక్ కలర్స్, వైడ్ రేంజ్178-డిగ్రీ IPS ప్యానెల్‌ కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 175Hz, డైనమిక్ ఫ్రేమ్ రేట్ మెనేజ్‌మెంట్, అడాప్టీవ్ సింక్ టెక్నాలజీ కలిగి ఉంది. డిజైన్ పరంగా చూస్తే.. మానిటర్ E24 ప్రీమియం స్లిమ్ 8mm డిజైన్, మెటల్ స్టాండ్, స్లీక్ బెజెల్స్ మూడు వైపులా ఉన్నాయి. ఈ మానిటర్ హైట్, యాంగిల్ అవసరానికి తగినట్టుగా అడ్జెస్ట్ చేసుకునే వీలుంది. లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ విజువల్స్ TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ ఫీచర్ ఉంటుంది.

OnePlus Monitors Sale : OnePlus Monitor E 24, Monitor X 27 Available For Sale In India; Price, Offers, And Specifications

OnePlus Monitors Sale : OnePlus Monitor E 24, Monitor X 27 Available For Sale In India

మరోవైపు.. మానిటర్ X27 ప్రీమియం మోడల్ 27 అంగుళాల డిస్‌ప్లేతో 165 రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ మానిటర్ గేమింగ్ ప్లేయర్లకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మానిటర్‌లో బిల్ట్- ఇన్ కేబుల్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ కూడా ఉంది. USB టైప్-C కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మల్టిపుల్ మోడ్‌లతో కస్టమైజ్డ్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్, సీమ్‌లెస్ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది. స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్,వేగంగా 1ms రెస్‌పాన్స్ అందిస్తుంది. AMD ఫ్రీసింక్ ప్రీమియంతో OnePlus Monitor X27 గేమ్‌కు తగినట్లుగా స్క్రీన్ అడ్జెస్ట్ చేస్తుంది. ఇష్టమైన గేమ్‌లను ఆడేందుకు కంటెంట్‌‌ను స్ట్రీమ్ చేసేందుకు షార్ప్ 2K QHD విజువల్ రిజల్యూషన్‌‌ను అందిస్తుంది.

Read Also : Tata Harrier Bookings : టాటా మోటార్స్ నుంచి సరికొత్త టాటా హారియర్ కారు.. ప్రీమియం ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!