OnePlus Summer Sale : మే 1 నుంచే వన్‌ప్లస్ సమ్మర్ సేల్.. ఈ వన్‌ప్లస్ ఫోన్లు, ప్యాడ్, బడ్స్ ప్రో, స్మార్ట్ వాచ్‌లపై బిగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

OnePlus Summer Sale : వన్‌ప్లస్ సమ్మర్ సేల్ 2025 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3, వన్‌ప్లస్ వాచ్ 2 మరిన్నింటిపై బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు, డిస్కౌంట్లు పొందవచ్చు.

OnePlus Summer Sale

OnePlus Summer Sale : వన్‌ప్లస్ 2025కి ‘సమ్మర్ సేల్’ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, వేరబుల్, ఆడియో డివైజ్‌లతో సహా ప్రొడక్టుల రేంజ్‌లో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మే 1 నుంచి భారతీయ యూజర్లు వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ Pad 2, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 మరిన్నింటి వంటి లేటెస్ట్ డివైజ్‌లపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లను పొందవచ్చు. ఈ డీల్స్ OnePlus.in, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింట్రా, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఇతర మెయిన్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Best Recharge Plans : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీ నెట్‌వర్క్ ఏదైనా 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

వన్‌ప్లస్ 13, 13R డిస్కౌంట్లు :
పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీతో కూడిన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 ఇప్పుడు రూ. 5వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు రూ. 3వేలు ధర డిస్కౌంట్, ఈజీ అప్‌గ్రేడ్స్ ప్రోగ్రామ్ ద్వారా 35శాతం బైబ్యాక్ ఆఫర్‌తో సహా 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ 13R కూడా ఆఫర్‌లో పొందవచ్చు. 16GB + 512GB వేరియంట్‌పై రూ.3వేలు బ్యాంక్ డిస్కౌంట్, అదనంగా రూ.2వేలు ధర తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 13R కొనుగోలుదారులు వన్‌ప్లస్ బడ్స్ 3ని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 12 ధర తగ్గింపు :
వన్‌ప్లస్ 12పై రూ.6వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.13వేల వరకు లిమిటెడ్ టైమ్ ధర తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై 6 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

నోర్డ్ లైనప్‌పై ఆఫర్లు :
వన్‌ప్లస్ నార్డ్ 4e ఏకైక మెటల్ యూనిబాడీ 5G ఫోన్ CE 4పై రూ.4,500 బ్యాంక్ డిస్కౌంట్, రూ.500 ధర తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE 4పై రూ.వెయ్యి ధర తగ్గింపు, రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తాయి. వన్‌ప్లస్ CE 4 లైట్‌పై కూడా ఎంపిక చేసిన కార్డులపై రూ.2,000 డిస్కౌంట్, 6 నెలల ఈఎంఐ ఆప్షన్లు లభిస్తాయి. మే 11 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

టాబ్లెట్స్, బడ్స్‌పై బిగ్ సేవింగ్స్ :
దివన్‌ప్లస్ ప్యాడ్ 2స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 3వేలు తగ్గింపు, రూ. వెయ్యి ధర తగ్గింపు, రూ. 3వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు అదనంగా రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. ప్యాడ్ గోపై విద్యార్థుల ఆఫర్లతో సహా రూ. 3,500 వరకు తగ్గింపులు కూడా పొందవచ్చు.

Read Also : Post Office Scheme : భార్యాభర్తల కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. జాయింట్ అకౌంట్లో పెట్టుబడి.. ఏడాదికి రూ. లక్షకుపైగా సంపాదించొచ్చు..!

ఆడియో, స్మార్ట్‌వాచ్ డీల్స్ :
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3, బడ్స్ 3 బ్యాంక్ ఆఫర్లు, ధర కూపన్లతో సహా రూ. 2,500 వరకు తగ్గింపుతో పొందవచ్చు. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అదనపు సేవింగ్స్ లభిస్తుంది. వన్‌ప్లస్ వాచ్ 2పై కలిపి రూ. 6వేల తగ్గింపు లభిస్తుండగా, వాచ్ 2Rపై రూ. 5వేలు మొత్తం తగ్గింపు, ఈఎంఐ బెనిఫిట్స్ లభిస్తాయి.