Online Gaming Bill 2025
Online Gaming Bill 2025 : పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025 ఆమోదించిన తర్వాత దేశీయ రియల్-మనీ గేమింగ్ (Online Gaming Bill 2025) ఇండస్ట్రీ గందరగోళంలో పడింది. ఈ బిల్లు డబ్బు ఆధారిత అన్ని ఆన్‌లైన్ గేమ్‌లపై నిషేధం విధిస్తుంది. అంతేకాదు.. రూ. 1 కోటి వరకు జరిమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని అతిపెద్ద గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు మనీ గేమింగ్‌లపై సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
ప్రధానంగా డ్రీమ్11 పేరెంట్ డ్రీమ్ స్పోర్ట్స్, మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL), గేమ్‌స్క్రాఫ్ట్, మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL), జుపీ తమ ప్లాట్‌ఫామ్‌లలో రియల్-మనీ గేమ్స్ సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాయి.
గేమ్స్, పేమెంట్ గేమ్స్ ఆఫర్లను కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నాయి. అన్ని రకాల ఆన్‌లైన్ మనీ గేమ్‌లను నిషేధించేందుకు ఈ వారమే లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఈ బిల్లును ఆమోదించాయి. అదేవిధంగా, ఈ బిల్లు ఇ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
డ్రీమ్ స్పోర్ట్స్ ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన కొత్త ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ డ్రీమ్ పిక్స్‌లోని అన్ని ‘పే టు ప్లే’ గేమ్స్ పాజ్ చేసినట్లు నివేదించింది.’ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025′ ఆమోదం తర్వాత మా ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని ‘పే టు ప్లే’ ఫాంటసీ స్పోర్ట్స్ గేమ్స్ పాజ్ చేస్తున్నాము. మీ అకౌంట్ బ్యాలెన్స్ సేఫ్‌గా ఉంది. మీరు Dream11 యాప్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.’ అని యాప్ నోటీసులో పేర్కొంది.
నివేదికల ప్రకారం.. ఈ కొత్త చట్టం అమలుతో కంపెనీ ఫ్లాగ్‌షిప్ డ్రీమ్ 11 యాప్‌లో పేమెంట్ గేమ్స్ నిలిపివేసేందుకు రెడీ అవుతోంది. డ్రీమ్11 యాప్‌లో ఒక టీమ్ క్రియేట్ చేసింది. “ప్రైజ్ పూల్”లో చేరేందుకు రూ. 29 (33 సెంట్లు) మాత్రమే ఖర్చవుతుందని సూచించింది.
ఆ తర్వాత వేలాది మంది విన్నర్ల మధ్య రూ. 3లక్షలు (3,438 డాలర్లు) టాప్ పేఅవుట్‌తో గిఫ్ట్ లభిస్తుంది. డ్రీమ్11 వాల్యూ 8 బిలియన్ డాలర్లు కాగా, ఈ సెక్టార్‌లో అతిపెద్ద పేయర్లలో ఒకటైన మొబైల్ ప్రీమియర్ లీగ్ విలువ 2.3 బిలియన్ డాలర్లుగా పిచ్‌బుక్ డేటా సూచిస్తోంది.
భారత గేమింగ్ మార్కెట్లో MPL ప్లాట్‌ఫామ్‌పై అన్ని మనీ గేమింగ్ ఆఫర్‌లను వెంటనే నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘మాకు అతిపెద్ద ప్రాధాన్యత మా వినియోగదారులే. కొత్త డిపాజిట్లు ఇకపై అంగీకరించేది లేదు. కస్టమర్‌లు తమ మిగిలిన డబ్బును ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మనీ గేమ్‌లు ఇకపై ఎంపీఎల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండవు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు కలిగిన ఎంపీఎల్ ప్లాట్‌ఫారం కొత్త చట్టం తర్వాత నిషేధించిన ఫస్ట్ గేమింగ్ ప్లాట్‌ఫారం ఇదే. మరో గేమింగ్ పోటీదారు జుపీ కూడా పేమెంట్ గేమ్స్ నిలిపివేస్తామని ధృవీకరించింది.
బెంగళూరుకు చెందిన గేమ్‌స్క్రాఫ్ట్, రమ్మీకల్చర్‌తో సహా రమ్మీ యాప్‌లలో ‘యాడ్ క్యాష్’ ‘గేమ్‌ప్లే సర్వీసు’ను పాజ్ చేస్తున్నట్లు తెలిపింది. “ప్లాట్‌ఫామ్ విధానాలకు అనుగుణంగా విత్‌డ్రా సర్వీసులు అందుబాటులో కొనసాగుతున్నాయి. యూజర్ల ఫండ్స్ మా వద్ద సురక్షితంగా ఉన్నాయి. ఇది మా గ్యారెంటీ. కొత్త చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం” అని కంపెనీ తెలిపింది.
మరోవైపు జుపీ కూడా తన పేమెంట్ ఆఫర్‌లను నిలిపివేసింది. కానీ, లూడో సుప్రీం, లూడో టర్బో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ట్రంప్ కార్డ్ మానియా వంటి ఫ్రీ గేమ్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతానికి “జుపీ పూర్తిగా పనిచేస్తోంది.
మా 150 మిలియన్లకు పైగా ప్లేయర్లు ప్లాట్‌ఫామ్‌లో తమకు ఇష్టమైన గేమ్స్ ఆడుకోవచ్చు. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025కి అనుగుణంగా పేమెంట్ గేమ్స్ మాత్రం నిలిపివేస్తున్నాం” అని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.