OPPO Sale Offers : వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లు.. ఈ ఒప్పో ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. రూ.9వేల వరకు తగ్గింపు పొందొచ్చు.. డోంట్ మిస్..!
OPPO Sale Offers : ఒప్పో ఇండియా వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన ఒప్పో ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

OPPO Valentine's Day Sale 2025
OPPO Valentine’s Day Sale 2025 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో ఇండియా వాలెంటైన్స్ వీక్ సేల్ మొదలైంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫోన్ ఆఫర్లు ఫిబ్రవరి 28, 2025 వరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.
ఫ్లాగ్‌షిప్ ఒప్పో ఫైండ్ X8 సిరీస్ నుంచి మిడ్-రేంజ్ ఒప్పో F27 ప్రో ప్లస్ వరకు, అనేక మోడళ్లు ఇప్పుడు భారీ బ్యాంక్ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులు ఈ సేల్ ఈవెంట్ సమయంలో ఒప్పో ఫైండ్ X8 ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు.. ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో రెండింటిపై కూడా భారీ డిస్కౌంట్లను పొందాయి. అదనంగా, కస్టమర్లు పేర్కొన్న ఫోన్లలో బెస్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒప్పో వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్‌లు, డీల్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒప్పో ఫైండ్ X8 :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 69,999, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 79,999కు అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక సైట్‌లో హై-ఎండ్ వేరియంట్ అందుబాటులో లేనప్పటికీ, బేస్ మోడల్‌ను HDFC, ICICI, BOBCARD, IDFC ఫస్ట్ బ్యాంక్, SBI కార్డులను ఉపయోగించి రూ. 7వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే.. మీరు ఈ ఒప్పో ఫోన్ కేవలం రూ. 62,999కు పొందవచ్చు. అదనంగా, ఒప్పో రూ. 8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో :
ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో రూ.99,999 ధరకు లాంచ్ అయింది. ఈ సేల్ సమయంలో, మీరు HDFC, ICICI, BOBCARD, IDFC ఫస్ట్ బ్యాంక్, SBI కార్డు లావాదేవీలపై రూ.9,999 వరకు తగ్గింపును పొందవచ్చు. దాంతో ఈ ఒప్పో ఫైండ్ X8 ఫోన్ ధర రూ.90వేలకు తగ్గుతుంది. ఇందులో రూ.8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
ఒప్పో రెనో 13 :
ఒప్పో రెనో 13 ఫోన్ రూ.37,999 నుంచి అందుబాటులో ఉంది. ఈ ఒప్పో రెనో ఫోన్ ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, (BOBCARD), యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ కార్డులను ఉపయోగించి రూ.3,799 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ సమయంలో వినియోగదారులు అదనంగా రూ.3వేల ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
ఒప్పో రెనో 13 ప్రో :
రెనో 13 ప్రో ఫోన్‌పై రూ.4,999 వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెనో 13 ప్రో ఫోన్ ధర రూ.45వేలకు తగ్గింది. ఒప్పో రెనో 13 ప్రోకు కూడా ఇదే ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.
ఒప్పో F27, ఒప్పో F27 ప్రో ప్లస్ :
ఒప్పో స్టాండర్డ్ ఒప్పో F27 ఫోన్‌పై రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఒప్పో F27 ప్రో ప్లస్‌పై రూ.2వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లు పరిమిత కాలానికి (ఫిబ్రవరి 28 వరకు) అందుబాటులో ఉంటాయని గమనించాలి.