Pakistan Stock Market Crash
Pakistan Stock Market Crash : పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భారీగా పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్ సూచీలు క్షీణించాయి. కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుదేలు అయింది. పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. పాక్ ఉగ్రవాదుల దాడి తర్వాత భారత ప్రభుత్వం దయాది దేశం విషయంలో కఠినమైన చర్యలు చేపట్టింది.
దాంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే కుప్పకూలింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) గురువారం ప్రారంభ వాణిజ్యంలో భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో పాకిస్తాన్ KSE-100 ఇండెక్స్ 2.12 శాతం (2485.85 పాయింట్లు) క్షీణించి 1,14,740.29 పాయింట్లకు చేరుకుంది.
మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులు అమ్మకాలు ప్రారంభించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు.
ఏప్రిల్ 24న మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి అనంతరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అనేక కఠినమైన నిర్ణయాలను ప్రకటించింది.
అందులో ప్రధానంగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్తాన్ పౌరులకు సార్క్ కింద వీసా మినహాయింపును రద్దు చేయడం వంటివి ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సింధు నది నీరు చాలా ముఖ్యమైనది.
దయాది దేశం ఎక్కువగా ఆ నీటిపై ఆధారపడుతోంది. అంతేకాదు.. పాకిస్థాన్ GDP వృద్ధి అంచనాలను IMF 2.6 శాతానికి తగ్గించింది. దీని ప్రభావంతో పాక్ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఈరోజు పాక్ స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొటోంది. కానీ, భారతీయ స్టాక్ మార్కెట్లపై మాత్రం ప్రభావం పెద్దగా పడలేదు.
భారత స్టాక్ మార్కెట్‌లో స్వల్ప క్షీణత :
మరోవైపు, భారత స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. గురువారం మధ్యాహ్నం 1.40 గంటల నాటికి BSE సెన్సెక్స్ 0.36 శాతం (285.31 పాయింట్లు) తగ్గి 79,831.18 పాయింట్ల వద్ద, NSE నిఫ్టీ50 0.33శాతం (80.55 పాయింట్లు) తగ్గి 24,248.40 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఈరోజు సెన్సెక్స్ 58.06 పాయింట్ల నష్టంతో 80,058.43 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 50 51.05 పాయింట్ల నష్టంతో 24,277.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.