LPG Cylinder Supply : బిగ్ అలర్ట్.. అదే జరిగితే.. మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ కాదు.. ఇప్పుడే బుక్ చేసుకోవడం బెటర్!
LPG Cylinder Supply : మూడు నెలల్లో అధిక కమిషన్ సహా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.

LPG Cylinder Supply
LPG Cylinder Supply : ఎల్ పీజీ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మూడు నెలల్లో అధిక కమిషన్ సహా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఒకవేళ యూనియన్ ఈ సమ్మెకు దిగితే గ్యాస్ సిలిండర్ల ఇంటి డెలివరీ అవ్వడం కష్టమే. ఇప్పుడే మందస్తుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడమే బెటర్. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
భోపాల్‌లో జరిగిన అసోసియేషన్ జాతీయ సమావేశం తర్వాత అధ్యక్షుడు బి.ఎస్. శర్మ పత్రికా ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. “డిమాండ్ల చార్టర్ గురించి వివిధ రాష్ట్రాల సభ్యులు ప్రతిపాదనను ఆమోదించారు.
ఎల్‌పీజీ పంపిణీదారుల డిమాండ్ల గురించి మేం పెట్రోలియం ఆఫ్ నేషనల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాశాం. ప్రస్తుతం ఎల్‌పీజీ పంపిణీదారులకు ఇస్తున్న కమిషన్ చాలా తక్కువగా ఉంది. ఆపరేటింగ్ ఖర్చులకు సరిపోవడం లేదు ”అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రకారం.. ఎల్‌పీజీ పంపిణీపై కమిషన్‌ను కనీసం రూ.150కి పెంచాలి. ఎల్‌పీజీ సరఫరా డిమాండ్, సరఫరా ఆధారంగా ఉంటుంది. కానీ, చమురు కంపెనీలు ఎలాంటి డిమాండ్ లేకుండానే దేశీయంగా తయారు చేయని సిలిండర్లను పంపిణీదారులకు బలవంతంగా పంపుతున్నాయి.
చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం. వెంటనే ఆపాలి. ఉజ్వల పథకం ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీలో కూడా సమస్యలు ఉన్నాయి” అని లేఖలో పేర్కొన్నారు. మూడు నెలల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతుందని లేఖలో హెచ్చరించారు.
గ్యాస్ సిలిండర్ ధర పెంపు ఇలా :
- ఏప్రిల్ 7న కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.50 పెంచింది.
- ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి పెరిగింది.
- కోల్‌కతాలో ధర రూ.829 నుంచి రూ.879కి పెరిగింది.
- ముంబైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50 నుంచి రూ.853.50కి పెరిగింది.
- చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.818.50 నుంచి రూ.868.50కి పెరిగింది.
- ఉజ్వల యోజన కింద పంపిణీ చేసిన సిలిండర్ల ధర కూడా పెరిగింది.