Panasonic LED TVs : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? పానసోనిక్ నుంచి 21 స్మార్ట్‌టీవీలు.. 32 నుంచి 75 అంగుళాలు.. ప్రీమియం ఫీచర్లు కేక.. ధర ఎంతంటే?
Panasonic LED TVs : కొత్త స్మార్ట్ టీవీ కొంటున్నారా? మీకోసం భారత మార్కెట్లోకి పానసోనిక్ ఇండియా నుంచి 21 స్మార్ట్‌టీవీ మోడల్స్ వచ్చేశాయి..

Panasonic LED TV
Panasonic LED TVs : కొత్త స్మార్ట్‌టీవీల కోసం చూస్తున్నారా? పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా భారత మార్కెట్లో కొత్త టెలివిజన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఇందులో మొత్తంగా (Panasonic LED TVs) 21 కొత్త LED టీవీ మోడళ్లు ఉన్నాయి.
ఇందులో ఫ్లాగ్‌షిప్ షినోబిప్రో మినీ LED రేంజ్ కూడా ఉంది. ఆగస్టు 7న ఈ కొత్త లైనప్ ప్రకటించగా, 32 అంగుళాల నుంచి 75 అంగుళాల వరకు స్క్రీన్ సైజులు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీల ధర రూ.17,990 నుంచి అందుబాటులో ఉంటాయి.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
కొత్త పానసోనిక్ టీవీలలో ShinobiPro MiniLED, ప్రీమియం 4K గూగుల్ టీవీ, అలాగే ఫుల్ HD, HD-రెడీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ రేంజ్‌లో టాప్ 75-అంగుళాల ShinobiPro మినీఎల్ఈడీ టీవీ ధర రూ. 3,99,990 వరకు ఉంటుంది, ఇందులో క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, పిక్సెల్ డిమ్మింగ్, 4K స్టూడియో కలర్ ఇంజిన్, హెక్సా క్రోమా డ్రైవ్, డాల్బీ విజన్, HDR10+, Accuview డిస్‌ప్లే ఉన్నాయి.
Read Also : UPI Payments : యూజర్లకు బిగ్ అలర్ట్.. UPI పేమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే? NPCI వన్‌షాట్ ఆన్సర్..!
ఈ సిరీస్ మినిమలిస్ట్ డిజైన్ (8.13 సెం.మీ. ఫ్లాట్ ఫిట్), 66W స్పీకర్లు, వూఫర్‌ల ద్వారా డాల్బీ అట్మోస్ సపోర్ట్, ట్వీటర్‌లతో ఇంటర్నల్ హోమ్ థియేటర్ కూడా అందిస్తుంది. గేమర్స్ ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM), స్మూత్ మోషన్ హ్యాండ్లింగ్ కోసం MEMCతో 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫీచర్లు గూగుల్ టీవీ, (Chromecast) ఇంటిగ్రేషన్ కలిగి ఉంది.
పానాసోనిక్ ఇండియాలో ఫుల్ P-సిరీస్ పానాసోనిక్ బ్రాండ్ స్టోర్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్, పానాసోనిక్ D2C సైట్‌లో అందుబాటులో ఉంది. సినిమాటిక్ కోసం పానాసోనిక్ 160W నుంచి 600W వరకు కొత్త సౌండ్‌బార్‌లను కూడా ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 12,990 నుంచి ప్రారంభమవుతుంది.