Cars Comparison
Cars Comparison : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఏ కారు కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, CNG కార్ల కన్నా ఎలక్ట్రిక్ కార్లకు (Cars Comparison) ఫుల్ డిమాండ్ పెరిగింది. కొత్త కారు కొనేముందు చాలా మంది వినియోగదారులు రన్నింగ్ కాస్ట్ ఎంత అనేది తప్పక అవగాహన కలిగి ఉండాలి.
ఎందుకంటే.. ఇంధన ధరలు పెరుగుతున్న క్రమంలో ఏ కారుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోవాలి. పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ కార్ల రన్నింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఎలాంటి కారు కొంటే ఇంధన ధరల భారం తగ్గించుకోవచ్చు అనేది కూడా తెలిసి ఉండాలి. ప్రస్తుత ఇంధనం/విద్యుత్ ధరలు, సగటు మైలేజ్ ఆధారంగా పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ కార్ల రన్నింగ్ కాస్ట్ ధరలను ఓసారి వివరంగా పరిశీలిద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ. 94.72 ఉంటే.. డీజిల్ లీటర్ ధర వచ్చేసి రూ. 87.67, CNG కిలోకు రూ. 76.09గా ఉంది. అదే ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే.. సగటున యూనిట్ హోం ఛార్జింగ్ కోసం రూ. 7 చెల్లించాలి. DC ఫాస్ట్ ఛార్జింగ్ సగటున యూనిట్‌కు రూ. 20 చెల్లించాలి.
ప్రస్తుత ఇంధన ధరలు (ఢిల్లీలో) :
పెట్రోల్ : లీటరుకు రూ. 94.72
డీజిల్ : లీటరుకు రూ. 87.67
CNG : కిలోకు రూ. 76.09
ఎలక్ట్రిక్ కార్లు :
సగటున యూనిట్‌కు రూ. 7 (హోం ఛార్జింగ్)
సగటున యూనిట్‌కు రూ. 20 (DC ఫాస్ట్ ఛార్జింగ్)
సగటు మైలేజ్/ రేంజ్ ఎంతంటే? :
సగటు మైలేజ్ పరంగా పరిశీలిస్తే..
పెట్రోల్ కార్లు : లీటరుకు 15–20 కి.మీ.
డీజిల్ కార్లు : లీటరుకు 20కి.మీ నుంచి 25 కి.మీ.
CNG కార్లు : కిలోగ్రాముకు 25 కి.మీ నుంచి 30 కి.మీ.
ఎలక్ట్రిక్ కార్లు : యూనిట్ విద్యుత్‌కు 4 కి.మీ నుంచి 6 కి.మీ.
కిలోమీటరుకు నిర్వహణ ఖర్చు.. ఎంతంటే?:
పెట్రోల్ : రూ. 5.41/కి.మీ (సగటు మైలేజ్ 17.5 కి.మీ/లీ)
డీజిల్ : రూ. 3.90/కి.మీ (సగటు మైలేజ్ 22.5 కి.మీ/లీ)
CNG : రూ. 2.77/కి.మీ (సగటు మైలేజ్ 27.5 కి.మీ/కి.మీ)
ఎలక్ట్రిక్ (హోమ్ ఛార్జింగ్) : రూ. 1.4/కి.మీ (సగటు పరిధి 5 కి.మీ/యూనిట్‌తో)
ఎలక్ట్రిక్ (DC ఫాస్ట్ ఛార్జింగ్) : రూ. 3.33/కిమీ (సగటు పరిధి 5 కి.మీ/యూనిట్‌తో)
ఎలక్ట్రిక్ కారు :
ఎలక్ట్రిక్ (హోమ్ ఛార్జింగ్) అత్యంత చౌకగా లభిస్తుంది. కి.మీకు కేవలం రూ. 1.4 మాత్రమే ఖర్చు అవుతుంది. CNG తర్వాత సిటీలో తిరిగేందుకు ఎలక్ట్రిక్ కారు చాలా బెస్ట్. ఎలక్ట్రిక్ (ఫాస్ట్ ఛార్జర్) ఇప్పటికీ పెట్రోల్ లేదా డీజిల్ కన్నా చాలా చౌకైనది. కానీ, హోం ఛార్జింగ్ కన్నా ఖరీదైనది.
డీజిల్ కార్లు :
పెట్రోల్ ధర కన్నా డీజిల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. లాంగ్ రన్ డ్రైవింగ్‌కు కిలోమీటర్‌కు పెట్రోల్ కార్లతో ఎక్కువగా ఖర్చవుతుంది.