Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. శాంసంగ్, వన్‌ప్లస్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో అదనపు బ్యాంకు డిస్కౌంట్లు..!

Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలు కానుంది. వన్‌ప్లస్ 13s, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15పై భారీ డీల్స్ అందిస్తోంది.

Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. శాంసంగ్, వన్‌ప్లస్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో అదనపు బ్యాంకు డిస్కౌంట్లు..!

Amazon Prime Day 2025

Updated On : July 3, 2025 / 12:07 PM IST

Amazon Prime Day 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? కొద్ది రోజులు ఆగండి.. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ మొదలుకాబోతుంది. ఈ అమెజాన్ సేల్ జూలై 12న ప్రారంభమై (Amazon Prime Day 2025) జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ సభ్యులందరికీ ఈ సేల్ ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి, అమెజాన్ ఇప్పటికే టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి డివైజ్‌లపై కొన్ని ప్రీ-డీల్స్ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను కూడా అమెజాన్ ప్రకటించింది.

అమెజాన్ ప్రైమ్ డే 2025.. స్మార్ట్‌ఫోన్‌లపై అదిరే డీల్స్ :
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లేటెస్ట్ ఎడిషన్‌లో వన్‌ప్లస్ 13s, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15 వంటి ఫోన్లపై కొన్ని భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్లపై ధర తగ్గింపుకు సంబంధించి ఇప్పటికే ఈవెంట్ మైక్రోసైట్‌లో రివీల్ చేసింది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐతో అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ సేల్ ICICI బ్యాంక్ కార్డులు లేదా SBI కార్డులు ఉన్న కస్టమర్లందరూ భారీ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ అమెజాన్ ప్రైమ్ డే డీల్‌లో భారీ డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. భారీ కెమెరాలతో ఐఫోన్ 17 సిరీస్ ప్రో వచ్చేస్తోందోచ్.. సరికొత్త అప్‌గ్రేడ్ ఫీచర్లు ఇవే..!

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా : 6.8-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అడ్రినో 750 GPUతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

వన్‌ప్లస్ 13s : వన్‌ప్లస్ ద్వారా 6.32-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ అడ్రినో 830 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. రెండు 50MP సెన్సార్‌లతో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 15 : ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లేను అందిస్తుంది. iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 48MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రా వైడ్-యాంగిల్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.