Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. భారీ కెమెరాలతో ఐఫోన్ 17 సిరీస్ ప్రో వచ్చేస్తోందోచ్.. సరికొత్త అప్‌గ్రేడ్ ఫీచర్లు ఇవే..!
Apple iPhone 17 Pro : భారీ కెమెరాలు, 12GB ర్యామ్‌తో ఐఫోన్ 17 సిరీస్ ప్రో రాబోతుంది. వచ్చే సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది..

Apple iPhone 17 Pro
Apple iPhone 17 Pro : ఆపిల్ లవర్స్ కోసం కొత్త ఐఫోన్ మోడల్ వచ్చేస్తోంది. వచ్చే సెప్టెంబర్ ప్రారంభంలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు (Apple iPhone 17 Pro) సన్నాహాలు చేస్తోంది. ఈసారి, కంపెనీ గత ఐఫోన్ ప్లస్ మోడల్ స్థానంలో ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టనుంది.
ఈ లైనప్‌లో మొత్తం 4 మోడళ్లు ఉంటాయి. అందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయి. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో ఏయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌లో మెయిన్ కెమెరా అప్‌గ్రేడ్స్ :
24MP ఫ్రంట్ కెమెరా : 4 మోడళ్లలో కొత్త 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
48MP టెలిఫోటో లెన్స్ : ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ 12MP నుంచి 48MP టెలిఫోటో లెన్స్‌తో వస్తాయి. క్రిస్పర్ జూమ్, పోర్ట్రెయిట్ షాట్ ఫీచర్లు
డిజైన్ ఓవర్‌హాల్ : అల్యూమినియం, హైబ్రిడ్ (బ్యాక్ సైడ్)
ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం, గాజుతో హైబ్రిడ్ బ్యాక్ ప్యానెల్‌తో అల్యూమినియం ఫ్రేమ్‌తో రానుంది. సర్కిల్ కార్నర్లతో కొత్తగా రీడిజైన్ దీర్ఘచతురస్రాకార కెమెరా హౌసింగ్ కూడా ఉండొచ్చు. ప్రో మోడల్స్ కోసం A19 ప్రో చిప్, 12GB ర్యామ్ అందిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ ఆపిల్ A19 ప్రో చిప్‌పై రన్ అవుతాయి. TSMC మోడల్ 3nm జెన్ 3 టెక్నాలజీతో రానుంది.
Read Also : RBI MSE Loans : ఆర్బీఐ చరిత్రాత్మక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్..!
Wi-Fi 7 చిప్ : ఆపిల్ కస్టమ్-డిజైన్ Wi-Fi 7 చిప్‌సెట్ బ్రాడ్‌కామ్ మాడ్యూల్ రిప్లేస్ చేస్తుంది.
12GB RAM : కొత్త ఐఫోన్ 17 ఎయిర్, ప్రో మోడల్స్ మల్టీ టాస్కింగ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల సపోర్టుకు 12GBకి ర్యామ్ అప్‌గ్రేడ్
భారత్‌లో ఐఫోన్ 17 ప్రో ధర (అంచనా) :
అప్‌గ్రేడ్‌ల దృష్ట్యా ఐఫోన్ 17 ప్రో ధర గతంలో ధర కన్నా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఇంకా కచ్చితమైన ధర రివీల్ చేయలేదు. బేస్ ప్రో వేరియంట్ ధర రూ. 1.5 లక్షల మార్కును దాటవచ్చు. అసలైన ధర, లభ్యత వివరాలు తెలియాలంటే ఆపిల్ అధికారిక సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే..