RBI MSE Loans : ఆర్బీఐ చరిత్రాత్మక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్..!

RBI MSE Loans : జనవరి 2026 నుంచి బ్యాంకులు, NBFC సంస్థలు రుణాలను ముందస్తుగా చెల్లించినందుకు సూక్ష్మ, చిన్న వ్యాపారాల నుంచి ఛార్జీలు వసూలు చేయలేవు.

RBI MSE Loans : ఆర్బీఐ చరిత్రాత్మక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్..!

RBI MSE Loans

Updated On : July 3, 2025 / 11:18 AM IST

RBI MSE Loans : బ్యాంకులో లోన్ తీసుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి రుణాలపై ప్రీ పేమెంట్ పెనాల్టీలు ఉండవు. ఈ లోన్ల విషయంలో ఆర్బీఐ (RBI MSE Loans) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేకించి వ్యాపార ప్రయోజనాల కోసం వ్యక్తులు, సూక్ష్మ, చిన్న సంస్థలు (MSE) తీసుకునే ఫ్లోటింగ్ రేట్ రుణాలు, అడ్వాన్సులపై ఎలాంటి ప్రీ పేమెంట్ ఛార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులు, NBFC సహా ఇతర రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది.

గత బుధవారమే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే, జనవరి 1, 2026న లేదా ఆ తర్వాత ఆమోదించిన రెన్యువల్ అయిన అన్ని రుణాలు, అడ్వాన్సులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.

ఆర్‌బీఐ సర్క్యులర్‌ జారీ :
ఆర్బీఐ సర్క్యులర్‌ ప్రకారం.. సూక్ష్మ, చిన్న సంస్థలకు (MSE) తక్కువ వడ్డీ రుణాలు చాలా ముఖ్యం. MSEలకు మంజూరైన రుణాలపై ప్రీపేమెంట్ ఛార్జీల విధింపునకు సంబంధించి రుణదాతలు విభిన్న పద్ధతులను వెల్లడించాయని, కస్టమర్ల ఫిర్యాదులతో పాటు పలు వివాదాలకు దారితీసిందని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ పేర్కొంది.

Read Also : iQOO 12 Price : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. అత్యంత చౌకైన ధరకే ఐక్యూ 12 ఫోన్.. ఇలాంటి డీల్ మళ్లీ జన్మలో రాదు..!

లోన్ అగ్రిమెంట్లలో తక్కువ వడ్డీ రేట్ల కోసం రుణగ్రహీతలు మరొక రుణదాతకు మారకుండా నిరోధించేందుకు నిర్బంధ నిబంధనలను కూడా కొన్ని నియంత్రిత సంస్థలు చేర్చినట్లు ఆర్బీఐ గుర్తించింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్‌లో వివరించింది.

బ్యాంకులకు ఆర్బీఐ సూచనలివే :
వ్యాపార ప్రయోజనాల కోసం వ్యక్తులు, (MSE)లకు ఇచ్చే అన్ని రుణాలకు సహ-రుణగ్రహీతలు లేదా వాణిజ్య బ్యాంకు (చిన్న ఆర్థిక బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, స్థానిక ప్రాంత బ్యాంకు మినహా), టైర్ 4 ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకు, NBFC-UL, అఖిల భారత ఆర్థిక సంస్థలకు రుణగ్రహీతలపై ఎలాంటి ప్రీ-పేమెంట్ ఛార్జీలను విధించకూడదని ఆర్బీఐ పేర్కొంది. వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా, సహ-రుణగ్రహీతలు ఉన్న లేదా లేని వ్యక్తులకు ఇచ్చే అన్ని రుణాలకు, నియంత్రిత సంస్థ (RE) ప్రీ పేమెంట్ ఛార్జీలను విధించకూడదని పేర్కొంది.

ఈ బ్యాంకులపై పరిమితి :
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, టైర్ 3 ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, NBFCML వంటివి రూ. 50 లక్షల వరకు పరిమితి కలిగిన రుణాలపై ఎలాంటి ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉండవు. ఫుల్ లేదా మినిమం లాక్-ఇన్ టైమ్ లేకుండా లోన్ ప్రీ-పేమెంట్ రుణాలపై ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది.

క్యాష్ లోన్/ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాల విషయంలో లోన్ అగ్రిమెంట్ కింద నిర్దేశించిన వ్యవధికి ముందు రెన్యువల్ చేయొద్దని రుణగ్రహీత ఆర్బీఐకి తెలియజేస్తే.. గడువు తేదీ ముగిసినా కూడా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తించవు. రిటైల్ లోన్ కస్టమర్లకు ముందస్తుగా పెనాల్టీలు వసూలు చేయకుండా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆర్బీఐ ఇప్పటికే నిషేధించింది.