iPhone 16 Offer : ఆపిల్ ఐఫోన్ 16 కావాలా? ఇలా చేశారంటే.. ఖరీదైన ఐఫోన్ ఇట్టే కొనేసుకోవచ్చు.. మీ బడ్జెట్ ధరలోనే..!

iPhone 16 Offer : ఆపిల్ ఐఫోన్ 16 కొనేవారికి గుడ్ న్యూస్.. ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లించి ఐఫోన్ కొనలేని వినియోగదారులకు అద్భుతమైన అవకాశం. మీరు ఈ విధంగా చెల్లించారంటే ఐఫోన్ 16 సొంతం చేసుకోవచ్చు.

iPhone 16

iPhone 16 Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఐఫోన్ 16 కొనేవారు అధిక తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుత రోజుల్లో ఆపిల్ ఐఫోన్ అంటే ఆ క్రేజే వేరు.. ఐఫోన్ కాస్ట్ చూసి చాలామంది కొనేందుకు వెనకాడుతుంటారు.

అదే ఐఫోన్ తక్కువ ధరకే వస్తుందంటే ఎవరైనా కొనేస్తామంటారు. అయితే, EMI (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) ఆప్షన్లతో మీరు ఎంత కాస్ట్ ఉన్న ఫోన్ అయినా సరే మీ బడ్జెట్ పరిధిలో కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కస్టమర్ల కోసమే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Read Also : iPhone 16 Pro Max : భలే డిస్కౌంట్ భయ్యా.. ఇలా చేస్తే.. తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మీ సొంతం..!

ఏదైనా ఫోన్ కొనుగోలు చేసినా పూర్తి మొత్తాన్ని ముందస్తుగా చెల్లించలేని వారికి ఈఎంఐ ఆప్షన్ ఎంతో బెస్ట్. ఈ రోజుల్లో చాలా మంది ఈఎంఐ పద్ధతినినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆపిల్ నుంచి లేటెస్ట్ లైనప్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఐఫోన్ 16e వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఐఫోన్ 16 కోసం చూస్తుంటే.. SBI, HDFC, ICICI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో ఈఎంఐ ద్వారా సులభంగా కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 16 వివిధ స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 128GB, 256GB, 512GB పాటు వివిధ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, 128GB వేరియంట్ ధర రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో రూ.72,900 ఉండగా, ఈఎంఐ పేమెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

SBI కార్డ్‌తో EMI ఆప్షన్ :
మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 6 నెలల ఈఎంఐ చెల్లించాలనుకుంటే.. మీరు 15.5 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.12,372 చెల్లించాలి. 6 నెలల వడ్డీతో సహా మొత్తం రూ.74,234 అవుతుంది. మీరు 12 నెలల ఈఎంఐ ప్లాన్‌ను ఎంచుకుంటే.. మీ నెలవారీ పేమెంట్ రూ.6,433కి తగ్గుతుంది. ఫలితంగా ఒక ఏడాది తర్వాత 15.75 శాతం వడ్డీ రేటుతో మొత్తం రూ.77,190 తిరిగి చెల్లించాలి.

HDFC క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నెలవారీ పేమెంట్లు ఈఎంఐ కాల వ్యవధి ఆధారంగా మారుతూ ఉంటాయి. 3 నెలల ఈఎంఐ ప్లాన్ ద్వారా నెలవారీ పేమెంట్ 16 శాతం వడ్డీ రేటుతో రూ. 24,300 అవుతుంది.

మీరు 6 నెలల ప్లాన్ ఎంచుకుంటే.. మీ నెలవారీ పేమెంట్ అదే వడ్డీ రేటుతో రూ. 12,390 అవుతుంది. ఒక ఏడాది ప్లాన్ కోసం నెలకు రూ. 6,440 చెల్లించాల్సి ఉంటుంది. మీ ఐఫోన్ 16 కొనుగోలు కోసం యాక్సస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ లేదా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లను వాడితే ఈఎంఐ పేమెంట్స్ HDFC బ్యాంక్ అందించిన మాదిరిగానే ఉంటాయి.

Read Also : US Visas : అమెరికా వెళ్లడం ఇకపై ఈజీ కాదు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ కొత్త రూల్‌తో మీ వీసా రద్దు అవ్వొచ్చు!

PNB క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ :
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఐఫోన్ 16 (128GB) కొనుగోలు చేస్తే.. వడ్డీ రేటు 12 శాతంగా ఉంటుంది. 6 నెలల ఈఎంఐకి నెలవారీగా రూ.12,250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 12 నెలల ఈఎంఐ ప్లాన్ ఎంచుకుంటే నెలవారీ రూ.6,307 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.