US Visas : అమెరికా వెళ్లడం ఇకపై ఈజీ కాదు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ కొత్త రూల్‌తో మీ వీసా రద్దు అవ్వొచ్చు!
US Visas : యూదు వ్యతిరేక కంటెంట్‌ను పోస్ట్ చేసే వ్యక్తులకు సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేస్తామని, వీసాలు లేదా రెసిడెన్సీ పర్మిట్స్ నిరాకరిస్తామని US ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.

No US Visas or Residence permits green cards
US Visas : అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇకపై విదేశీ ప్రయాణం అంత సులభం కాదు.. యూదు వ్యతిరేక కంటెంట్‌ను పోస్ట్ చేసే వ్యక్తులకు సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేస్తామని, వారి వీసాలు లేదా రెసిడెన్సీ పర్మిట్ నిరాకరిస్తామని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.
ఇజ్రాయెల్ పౌరులు లేదా యూదు సమాజాన్ని విమర్శించే పోస్ట్‌లను షేర్ చేసే వ్యక్తులకు యుఎస్ వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్ లభించదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఏజెన్సీ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తెలిపింది. ఈ కొత్త రూల్ వెంటనే అమలులోకి వస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉండటానికి విద్యార్థి వీసాలు, పర్మినెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డుల కోసం చేసే అభ్యర్థనలకు వర్తిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పుడు, అమెరికా వెళ్లాలనుకునే వారు అక్కడికి వెళ్లడం మునుపటిలా సులభం కాదు. మీకు వ్యాలీడ్ అయ్యే యూఎస్ వీసా లేదా గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ, ట్రంప్ కొత్త వలస విధానాల ప్రకారం.. మీరు ఇప్పటికీ యూఎస్ విమానాశ్రయాలలో నిర్బంధం, బహిష్కరణ లేదా ఇతర నిషేధాలను ఎదుర్కోవలసి రావచ్చు.
ఇజ్రాయెల్ పౌరులు లేదా యూదు సమాజాన్ని విమర్శించే పోస్ట్‌లను షేర్ చేయడం వల్ల కూడా యుఎస్ వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్ తిరస్కరణకు గురవుతుందని ఏజెన్సీ యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తెలిపింది.
ఇలాంటి వారికి వీసా రాదు :
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివిటీని ఎప్పటికప్పుడూ చెక్ చేస్తామని, అలాంటి వ్యక్తులకు వీసాలు లేదా దేశంలో నివసించేందుకు అనుమతిని నిరాకరిస్తామని చెప్పారు. ఈ కొత్త విధానం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.
యునైటెడ్ స్టేట్స్‌లో ఉండేందుకు విద్యార్థి వీసాలు, పర్మినెంట్ రెసిడెన్స్ గ్రీన్ కార్డుల కోసం చేసే అభ్యర్థనలకు వర్తిస్తుంది. USCIS ప్రకారం.. హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలకు మద్దతు ఇచ్చే పోస్ట్‌లు సెమిటిక్ వ్యతిరేక కంటెంట్‌గా పరిగణిస్తారు. వీసా దరఖాస్తు ప్రక్రియలో ఇలాంటివారికి ప్రతికూల అంశంగా మారుతుందని గమనించాలి.
ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో చోటు లేదు :
‘ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో చోటు లేదు’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS)లో ప్రజా వ్యవహారాల సహాయ కార్యదర్శి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ అన్నారు. ఇలాంటి వారిని దేశంలోకి ప్రవేశించడానికి లేదా ఇక్కడ ఉండేందుకు అనుమతించే బాధ్యత మాకు లేదని చెప్పారు. ‘అమెరికాకు వచ్చి జీవించవచ్చని అనుకునే ఎవరైనా సెమిటిక్ వ్యతిరేక హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ మరోసారి ఆలోచించాలి.. మీలాంటి వారికి ఇక్కడ ఉండేందుకు అర్హత లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ వీసాలపై ట్రంప్ కఠిన వైఖరి :
గత జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది విదేశీ విద్యార్థులను బహిష్కరించారు. అనేక దేశాల వీసాలను రద్దు చేశారు. పాలస్తీనా అనుకూల నిరసనల కారణంగా యూనివర్శిటీలకు సమాఖ్య నిధుల కోతలు విధించనున్నట్లు హెచ్చరించారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గత నెల చివర్లో దాదాపు 300 మందికి వీసాలను రద్దు చేశానని చెప్పారు. “ఈ సమయంలో 300 కన్నా ఎక్కువ ఉండవచ్చు. మేం ప్రతిరోజూ ఇలాగే చేస్తాం. ఇలాంటి వారి వీసాలను రద్దు చేస్తుంటాం’’ అని అమెరికా అగ్ర దౌత్యవేత్త పేర్కొన్నారు.
అత్యంత హై ప్రొఫైల్ బహిష్కరణ కేసుల్లో ఒకటి పాలస్తీనా అనుకూల మహమూద్ ఖలీల్.. గత ఏడాది న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీల్లో నిరసనలకు నాయకత్వం వహించాడు. సిరియాకు చెందిన అల్జీరియా పౌరుడైన ఖలీల్ 2022లో విద్యార్థి వీసాపై అమెరికాలోకి ప్రవేశించాడు. ఆ తరువాత 2024లో పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.