PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే.. ఈలోగా రైతులు చేయాల్సిన పనులివే.. లేదంటే రూ. 2వేలు పడవు!

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత కోసం చూస్తున్నారా? అయితే, రైతులు ఈ పనులను వెంటనే పూర్తి చేయండి.. లేదంటే మీ బ్యాంకు అకౌంట్లలో జమ కావాల్సిన రూ. 2వేలు రావు. ఈ డబ్బులను పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

PM Kisan Scheme

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం రైతులకు ఏటా 6 వేల రూపాయలు ఇస్తుంది.

ఈ డబ్బును ఒక్కొక్కటి రూ. 2 వేల చొప్పున మూడు విడతలుగా అందిస్తోంది. కానీ, పీఎం కిసాన్ 20వ విడత పొందలేని రైతులు చాలా మంది ఉన్నారు. ఈ వాయిదా అందాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి.

Read Also : Jio Offer : జియో ఆఫర్ అదిరింది.. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 72 రోజుల వ్యాలిడిటీ, 164GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా హాట్‌స్టార్ చూడొచ్చు!

అప్పుడు మాత్రమే అర్హతగల రైతులకు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు వారి బ్యాంకు అకౌంట్లలో జమ అవుతాయి. ఇంతకీ రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఏయే పనులు పూర్తి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ యోజన కింద ప్రతి విడత సుమారు 4 నెలల వ్యవధిలో వస్తుంది. ఉదాహరణకు.. 18వ విడత అక్టోబర్ నెలలో వచ్చింది. 19వ విడత ఫిబ్రవరి నెలలో విడుదలైంది. దీని ప్రకారం.. 20వ విడత జూన్‌లో విడుదల కావచ్చు. అయితే, అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది.

ఏ రైతులకు రూ.2వేలు పడవంటే? :
మీరు e-KYC చేయకపోతే.. మీకు రావాల్సిన డబ్బులు రావు. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం పీఎం కిసాన్ వాయిదా పొందడానికి చాలా ముఖ్యమైన పని. మీరు ఈ పనిని పూర్తి చేయకపోతే.. మీ సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించడం ద్వారా (pmkisan.gov.in) స్కీమ్ అధికారిక పోర్టల్ ద్వారా లేదా యాప్ ద్వారా కూడా ఈ పనిని పూర్తి చేయవచ్చు. భూమి ధృవీకరణ చేయించుకోని రైతులకు కూడా పీఎం కిసాన్ వాయిదా డబ్బులు నిలిచిపోతాయి.

రైతుల భూమిని ధృవీకరించిన తర్వాత డాక్యుమెంట్లను కూడా ధృవీకరిస్తారు. ఎవరైనా రైతు ఈ పని పూర్తి చేయకపోతే రావాల్సిన రూ.2వేలు నిలిచిపోవచ్చు. ఆధార్ లింకింగ్ పని పూర్తి చేయని రైతుల వాయిదాలు కూడా నిలిచిపోతాయి.

Read Also : Flipkart Sale Offer : ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ సేల్.. ఆపిల్ ఐఫోన్లు, ఏసీలు, స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

ఇందులో రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేయాలి. రైతులు తమ బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. కానీ, మీరు ఈ పని పూర్తి చేయకపోతే మీరు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను పొందలేరు.