PM Kisan 20th Installment Update : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా లబ్ధిదారు రైతులు రూ. 2వేల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపటి 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది.
ఈసారి జూలైలో రావాల్సిన 20వ విడత రూ.2వేలు చెల్లింపు ఆలస్యం అయింది. గత ఏడాదిలో జూన్ ఆఖరుకు ముందుగానే విడత విడుదల అయింది. అయితే, ఇప్పుడు నిర్దిష్ట అర్హత ప్రమాణాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసిన రైతులకు మాత్రమే 20వ విడత అందనుంది. రూ. 2వేలు అకౌంటులో పడాలంటే రైతులు ఏయే పనులు ముందుగా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పీఎం కిసాన్ 20వ వాయిదా అర్హతలివే : పీఎం కిసాన్ పథకం కింద రైతులు ప్రయోజనాలను పొందాలంటే..
భారతీయ పౌరుడిగా ఉండాలి.
సొంత సాగు వ్యవసాయ భూమి
చిన్న లేదా సన్నకారు రైతుగా ఉండాలి.
నెలకు రూ. 10వేలకు పైగా పెన్షన్ ఉండకూడదు.
ఆదాయపు పన్ను చెల్లించేవారు కాకూడదు.
సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.
20వ వాయిదా పొందాలంటే ఈ పనులు పూర్తి చేయాలి PM Kisan :