PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ నెల 18నే 20వ విడత విడుదల?.. రూ. 2వేలు పడాలంటే ఇప్పుడే ఈ పని చేయండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతులు 20వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 2వేలు పడకముందే మీ అడ్రస్ ఇలా మార్చుకోండి.

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ నెల 18నే 20వ విడత విడుదల?.. రూ. 2వేలు పడాలంటే ఇప్పుడే ఈ పని చేయండి..!

PM Kisan 20th Installment Date

Updated On : July 15, 2025 / 6:01 PM IST

PM Kisan 20th Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈసారి రూ.2వేలు (PM Kisan) కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈసారి రావాల్సిన 20వ విడత ఆలస్యం అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో రైతుల కోసం రూ.2వేలు విడుదల చేస్తారని భావిస్తున్నారు.

ఈ పీఎం కిసాన్ వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల అవుతుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. గత ఏడాదిలో జూన్ విడత నెల ముగిసేలోపు విడుదల అయింది. ఈసారి, 20వ విడత విడుదల ఆలస్యం అయింది. అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 18వ తేదీన 20వ విడత విడుదల అవుతుందని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

వాయిదా పడేలోగా రైతులు తమ అర్హతను తెలుసుకోవాలి. e-KYC అప్ డేట్ చేసుకోవాలి. లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేసుకోవాలి. అలాగే, ల్యాండ్ అడ్రస్ వ్యాలిడిటీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక రైతు తమ అడ్రస్ లేదా లొకేషన్ రికార్డులలో లోపాల కారణంగా “అనర్హుడు”గా గుర్తిస్తే వెంటనే తమ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలి. అనర్హతకు సాధారణ కారణాలలో భూమి అడ్రస్ తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉన్నప్పుడు భూమిని సాగు చేస్తున్నప్పటికీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుంది.

పీఎం కిసాన్ ల్యాండ్ అడ్రస్ ఎలా అప్‌డేట్ చేయాలి? :
1. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
2. ‘Farmers Corner’ కింద హోమ్‌పేజీలో ‘State Transfer Request’పై క్లిక్ చేయండి.
3. ‘Registration Number’ లేదా ‘Aadhaar Number’ ఎంటర్ చేయండి.
4. కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
5. ‘Get OTP’పై క్లిక్ చేయండి.
6. OTP ఎంటర్ చేయండి.
7. మీ పేరు మీద ‘proof of cultivable land’ (భూమి రికార్డులు, ఖస్రా/ఖాటో) అప్‌లోడ్ చేయండి.
8. మీ మార్పులను రివ్యూ చేసి ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి.

అడ్రస్ మార్పు కోసం CSC సెంటర్‌కు వెళ్లండి :
కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) అడ్రస్ మార్చుకోవడం సహా పీఎం కిసాన్ సర్వీసులు పొందవచ్చు. ఏదైనా అప్‌డేట్ కోసం రైతులు తమ సమీప CSC సెంటర్ సందర్శించవచ్చు. పేమెంట్ పెండింగ్‌లో ఉంటే అడ్రస్ మార్పుకు సమయం పట్టవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో పేమెంట్ పంపిణీ తర్వాత మాత్రమే ప్రాసెస్ అవుతుందని పీఎం కిసాన్ వెబ్‌సైట్ తెలిపింది.

Read Also : Realme 15 Pro 5G : 50MP మెయిన్ రియర్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌‌తో రియల్‌మి 15 ప్రో 5G.. లాంచ్ ఎప్పుడంటే?

పీఎం కిసాన్ 20వ వాయిదా ముందే పూర్తి చేయాల్సిన పనులివే :

  • పీఎం కిసాన్ పథకం 20వ విడత రూ. 2వేలు అందాలంటే రైతులు ఈ పనులను పూర్తి చేయాలి.
  • ఫుల్ e-KYC ఉండాలి. లేదంటే ఏ వాయిదా పొందలేరు.
  • ఆధార్‌, బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ వివరాలను ధృవీకరించండి : రాంగ్ IFSC లేదా అకౌంట్ నంబర్లు ఉండకూడదు.
  • భూమి రికార్డు సమస్యలను పరిష్కరించండి : భూమి యాజమాన్యాన్ని డిజిటల్ రికార్డులలో వెరిఫై చేసుకోవాలి.
  • లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేయండి : మీ పేరు ప్రస్తుత జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి.
  • మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి.
  • OTP, అధికారిక నోటిఫికేషన్లు పొందవచ్చు.

పీఎం కిసాన్ 20వ విడత విడుదల ఎప్పుడు? :
ప్రధానమంత్రి కిసాన్ పథకం 20వ విడతను ప్రధాని మోదీ జూలై 2025లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. చివరి (19వ) విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది.

20వ వాయిదా ఎందుకు ఆలస్యం? :
ప్రధానమంత్రి కిసాన్ వాయిదా సాధారణంగా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లలో విడుదల అవుతుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి కాలక్రమం ఉంటుందని భావించారు. అయితే, ఈసారి 20వ విడత వాయిదా తేదీపై అధికారిక ప్రకటన ఆలస్యం అయినట్లు కనిపిస్తోంది. ఈసారి ఎందుకు ఆలస్యం అవుతుందనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే, జూలైలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ మొత్తాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

e-KYC ఎలా పూర్తి చేయాలి? :
పీఎం కిసాన్ 20వ వాయిదా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అర్హత కలిగిన రైతులు అంతకు ముందే పూర్తి చేయాలి. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC తప్పనిసరి. లేదంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. e-KYC మూడు సులభమైన మార్గాల్లో పూర్తి చేయవచ్చు.

  • OTP- ఆధారిత e-KYC
  • బయోమెట్రిక్ e-KYC
  • ఫేషియల్ అథెంటికేషన్

మీ పీఎం కిసాన్ (PM Kisan) వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి?  :

  • అధికారిక (https://pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
  • ‘Know Your Status’పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి.
  • మీ eKYC పూర్తి అయి ఉండాలి.

పీఎం కిసాన్ పథకం ఏంటి? :
2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకంగా మారింది. అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున మొత్తం ఏటా రూ. 6వేలు చొప్పున అందుకుంటారు. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలలో ఈ మొత్తాన్ని అందుకుంటారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

PM కిసాన్‌కు ఎవరు అర్హులు? :

  • భారతదేశ పౌరుడిగా ఉండాలి.
  • సొంత సాగు భూమి
  • చిన్న లేదా సన్నకారు రైతులు
  • నెలకు రూ. 10వేలకుపైగా ఎక్కువ పెన్షనర్ కాకూడదు.
  • ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు.
  • సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.

పీఎం కిసాన్ పథకం కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి? :

  • అధికారిక (https://pmkisan.gov.in)కి వెళ్లండి.
  • ‘New Farmer Registration’పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
  • పూర్తి వివరాలను నింపండి. ‘Yes’పై క్లిక్ చేయండి.
  • ఫారమ్‌ను పూర్తి చేసి Submit చేసి ప్రింటవుట్ తీసుకోండి.
  • ఏవైనా సందేహాలు ఉంటే పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌లకు (155261, 011-24300606) కాల్ చేయవచ్చు.