PM Kisan Yojana
PM Kisan 20th instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం (PM Kisan) అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు ఇస్తోంది. రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని అందుకుంటారు. ప్రతి విడతలో రైతులు రూ. 2వేలు బ్యాంకు అకౌంటులో జమ అవుతుంది.
పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు విడుదల కానుందో ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కొన్ని నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 20వ విడత ఈ నెల జూన్ 20న విడుదల అయ్యే అవకాశం ఉంది. e-KYC పూర్తి చేసిన రైతుల ఖాతాలో మాత్రమే రూ. 2వేలు పడతాయి. మీరు ఇంకా కేవైసీ పూర్తి చేయకపోతే.. ఆన్‌లైన్‌లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Motorola Edge 50 : ఆఫర్ అదిరింది గురూ.. రూ.28వేల మోటోరోలా ఫోన్ కేవలం రూ. 15వేలకే.. ఇప్పుడే కొనడం బెటర్..!
పీఎం-కిసాన్ పథకం ఏంటి? :
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అనేది భారత ప్రభుత్వం అందించే అద్భుతమైన పథకం. దేశవ్యాప్తంగా అర్హతగల భూమి కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ మొత్తాన్ని రూ.2వేలు చొప్పున 3 విడతలుగా విడుదల చేస్తారు.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా లబ్ధిదారుల బ్యాంకు అకౌంటులో నేరుగా జమ చేస్తారు. ఈ పథకం కింద ప్రయోజనాలను ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది.
20వ విడత తేదీ ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 20వ విడత జూన్ 20, 2025న విడుదల అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. 19వ విడత గత ఫిబ్రవరిలో విడుదలైంది.
ఎవరు అర్హులు? :
eKYC ఎలా పూర్తి చేయాలంటే? :
పీఎం కిసాన్ యోజనకు eKYC చాలా ముఖ్యం. కేవైసీ కోసం రైతులు మొబైల్ యాప్, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవైసీ పూర్తి చేసేందుకు ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
బ్యాంక్ అకౌంటుతో ఆధార్ లింక్ చేయండి : (PM Kisan)
లబ్ధిదారుని స్టేటస్ ఇలా చెక్ చేయండి :