PM Kisan 20th Installment Date
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత విడుదల అయింది. జమ్మూ కాశ్మీర్‌లోని 8.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు జమ అయ్యాయి.
గతంలో కేంద్ర ప్రభుత్వం 3 వరద (PM Kisan 21st Installment Date) ప్రభావిత ప్రాంతాలలో 27 లక్షల మంది రైతులకు రూ. 2000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఆ వాయిదా డబ్బును బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21వ వాయిదా వేగంగా పంపిణీ చేస్తోంది. అక్టోబర్ మధ్య నాటికి లేదా దీపావళికి ముందు పూర్తవుతుందని అంచనా.
ఈ పథకం రైతులకు కనీసం రూ. 6వేలు చొప్పున వార్షిక ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ఆదాయం రైతులకు 3 సమాన వాయిదాలలో అందుతుంది. అనేక రాష్ట్రాల్లో 27 లక్షల మంది రైతులు ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 2000 అందుకున్నారు. మరికొందరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ 21వ పొందాలంటే ఇలా చేయండి :
ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని లేదా బ్యాంకు అకౌంటుతో ఆధార్‌ను లింక్ చేయకపోవడం, భూమి ధృవీకరణను పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్ 21వ విడత అందదు. తప్పుగా బ్యాంకింగ్ వివరాలు ఉన్నవారు పేమెంట్ అందుకోలేరు. లేదంటే వాయిదా రావడం ఆలస్యం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఈ కింది పనులు వెంటనే పూర్తయ్యేలా చూసుకోండి.
ఇ-కేవైసీ ప్రక్రియ :
రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in)ని విజిట్ చేయాలి. ఆధార్ నంబర్, ఓటీపీ ఉపయోగించి ఇ-కేవైసీని ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్స్ ధృవీకరణ కోసం సమీపంలోని CSC కేంద్రాలు లేదా బ్యాంకులకు వెళ్లవచ్చు.
పీఎం కిసాన్ 21వ వాయిదా స్టేటస్ చెక్ చేయాలంటే? :
పీఎం కిసాన్ యోజన అర్హతలు :
సాగు భూమి ఉన్న అన్ని రైతు కుటుంబాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు.