Starlink Launch Date : భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోందోచ్.. శాటిలైట్ ఇంటర్నెట్ డేటా ప్లాన్లు, ధర, లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్!
Starlink Launch Date : స్టార్‌లింక్ త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు రాబోతుంది. వినియోగదారులు 25Mbps నుంచి 225Mbps వరకు స్పీడ్ అందుకోగలరు.

Starlink Launch Date
Starlink Launch Date : భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోంది. దేశీయ మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. భారతీయ ఇంటర్నెట్ యూజర్ల కోసం ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుగా మొదటగా స్టార్‌లింక్ అందించనుంది. అయితే, ఈ ఇంటర్నెట్ సర్వీసు ప్రారంభానికి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులను పొందాల్సి ఉంది.
ప్రస్తుతానికి దాదాపు అన్నింటికి ఆమోదం (Starlink Launch Date) లభించినప్పటికీ ఇంకా కొన్ని లాంఛనాలు మిగిలి ఉన్నాయి. భారత మార్కెట్లో స్టార్‌లింక్ సర్వీసుతో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అంతేకాకుండా, స్టేబుల్ నెట్‌వర్క్ కోసం ఇబ్బంది పడుతున్న అన్ని మారుమూల ప్రాంతాలకు ఈ ఇంటర్నెసర్వీసు బిగ్ రిలీఫ్ అందించనుంది.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్, లభ్యత :
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వినియోగదారులకు 25Mbps నుంచి 225Mbps మధ్య స్పీడ్ అందిస్తుందని అంచనా. ప్రారంభ రేంజ్ ప్లాన్ 25Mbps అందించే అవకాశాలు ఉన్నాయి. హై-ఎండ్ ప్లాన్ ప్రాథమిక ప్లాన్‌తో పోలిస్తే కొంచెం ఖరీదైనదిగా ఉండొచ్చు. 225Mbps వేగాన్ని అందిస్తుంది.
ఇప్పటివరకు, దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలను స్టార్‌లింక్ అధికారికంగా ధృవీకరించలేదు. లభ్యత విషయానికొస్తే, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ మద్దుతుగా ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును భారత మార్కెట్లో 2లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను మాత్రమే కలిగి ఉండేలా పరిమితిని విధించింది.
భారత్ స్టార్‌లింక్ ధర, లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
భారత మార్కెట్లో స్టార్‌లింక్ కంపెనీకి ఇంటర్నెట్ సర్వీసు కార్యకలాపాలకు అవసరమైన అన్ని అనుమతులను పొందింది. ఇప్పుడు, (SATCOM) గేట్‌వేలకు ఆమోదం పొందాల్సి ఉంది. అవసరమైన స్పెక్ట్రమ్‌ను పొంది లైసెన్స్ తీసుకోవడం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవన్నీ 2025 చివరి నాటికి పూర్తవుతాయని అంచనా. జనవరి 2026 నాటికి భారతీయ మార్కెట్లో ఈ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని భారీ అంచనాలు నెలకొన్నాయి.
ధరల విషయానికి వస్తే.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు భారత మార్కెట్లో సింగిల్ సెటప్ ఖర్చు రూ. 30వేలు ఉంటుందని అంచనా. అంతేకాకుండా, వినియోగదారులు రూ. 3,300 ధర నుంచి స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసు ప్లాన్లను ఎంచుకోవచ్చు.
ఇందులో బేస్ ప్లాన్ 25Mbps స్పీడ్ అందిస్తుందని అంచనా. 225Mbps ప్లాన్ ధరపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి తెలిసిన విషయం ఏమిటంటే.. స్టార్‌లింక్ భారతీయ యూజర్ల సెటప్ కోసం రూ. 30వేలు ముందస్తు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో స్టార్‌లింక్ ప్లాన్ల కోసం చెల్లించడం వినియోగదారులకు కష్టంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.