PM Kisan 21st installment
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టులో 20వ విడత విడుదల చేశారు. 2.4 కోట్ల మంది మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. జూన్‌లో అంచనాలకు భిన్నంగా ఈ విడత ఆలస్యమైంది. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదా విడుదల అవుతుంది. రైతులు ఈ నెలలో 21వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. 19వ విడత ఫిబ్రవరిలో, 2024 అక్టోబర్ 18వ విడత, జూన్ 2024లో 17వ విడత విడుదలయ్యాయి.
పీఎం కిసాన్ పథకం ఏంటి? :
పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన (PM Kisan 21st installment) రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున ఏడాదికి రూ. 6వేలు చొప్పున అందుతుంది. ఈ డబ్బును ప్రతి ఏడాది (ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి) 3 విడతలుగా అందిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆ తరువాత పీఎం మోదీ ప్రారంభించారు.
రైతులకు పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుంది? :
మీడియా నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి కిసాన్ పథకం 21వ విడత నవంబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. జమ్మూ కాశ్మీర్‌లోని వరదలు, కొండచరియలు విరిగిపడిన రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ పథకం 21వ విడతను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని కృషి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముందస్తుగా పీఎం కిసాన్ 21వ వాయిదాను విడుదల చేశారు. ఈ విడుదల కింద జమ్మూ కాశ్మీర్‌లోని 85వేల మంది మహిళా రైతులు సహా 8.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.171 కోట్లు నేరుగా బదిలీ అయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతంలోని రైతులు ఇప్పటివరకు పీఎం కిసాన్ కింద మొత్తం రూ.4,052 కోట్లు అందుకున్నారు.
పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? :
ఈ రైతులకే రూ. 2వేలు :
వాయిదాలను స్వీకరించేందుకు రైతులు తమ e-KYCని పూర్తి చేయాలి. పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ నమోదిత రైతులకు eKYC తప్పనిసరి. OTP-ఆధారిత ఇ-కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
1) అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)ను విజిట్ చేయండి.
2) ఇప్పుడు, పేజీ రైడ్ సైడ్ ‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3) మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి, కాప్చా కోడ్‌ను నింపండి.
4) ‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి.
5) మీ లబ్ధిదారుడి స్టేటస్ స్ర్కీన్‌పై కనిపిస్తుంది.
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయండి :
పీఎం కిసాన్ పథకం కోసం ఎలా అప్లయ్ చేయాలి? :