PM Kisan Yojana
PM Kisan Payment : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. మీకు పీఎం కిసాన్ 20వ విడత రూ. 2వేలు ఇంకా అందలేదా? మీ బ్యాంకు అకౌంటులో డబ్బులు పడలేదంటే (PM Kisan Payment) చాలా కారణాలు ఉంటాయి. అవేంటో ముందుగా తెలుసుకోండి. భారత్‌లో కోట్లాది మంది రైతులు ఉన్నారు. వారిలో చాలామంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. నిరుపేద రైతుల కోసం భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ఆర్థిక సాయం లభిస్తుంది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 20వ విడతను రైతులకు విడుదల చేసింది. ప్రధానమంత్రి కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకుని ఉండి 20వ విడత వాయిదా మీ ఖాతాకు ఇంకా రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
చాలా సార్లు కొన్ని సాధారణ తప్పుల వల్ల రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. రూ. 2వేలు మీ బ్యాంకు అకౌంటులో జమ కాకపోతే ఏం చేయాలి? పీఎం కిసాన్ డబ్బులు తిరిగి పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి కారణాలివే :
పీఎం కిసాన్ యోజన 20వ విడత వాయిదా డబ్బు మీ అకౌంటుకు రాలేదా? ముందుగా మీ వాయిదా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోవాలి. ఇందుకోసం పథకం అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) విజిట్ చేయడం ద్వారా మీ స్టేటస్ చెక్ చేయవచ్చు.
ఇ-కెవైసీ ఎలా చేయాలి? :
ప్రధానమంత్రి కిసాన్ యోజనలో e-KYC పూర్తి చేయడం చాలా ముఖ్యం. మీ అకౌంటులో e-KYC చేయకపోతే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ వెంటనే పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్ e-KYC ప్రాసెస్ :
ఆఫ్‌లైన్ e-KYC ఎలా చేయాలి? :
మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోయినా లేదా OTP రాకపోయినా మీ సమీపంలోని CSC (కామన్ సర్వీస్ సెంటర్)కి వెళ్లవచ్చు. అక్కడ మీరు ఫింగర్ ఫ్రింట్ ద్వారా ఆఫ్‌లైన్ e-KYCని పొందవచ్చు. మీ పీఎం కిసాన్ వాయిదా డబ్బు మీ ఖాతాలో ఉందో చెక్ చేయొచ్చు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలంటే ఈ పనులను తప్పక పూర్తి చేయండి.