LOQ Gaming Laptops : గేమర్లు, క్రియేటర్లకు పండగే.. లెనోవో LOQ గేమింగ్స్ ల్యాప్‌టాప్స్.. హైపర్‌చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఫీచర్లు, ధర ఎంతంటే?
LOQ Gaming Laptops : లెనోవో గేమింగ్ ల్యాప్‌టాప్స్ హైపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి.

LOQ Gaming Laptops
LOQ Gaming Laptops : కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవా కొత్త LOQ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో (LOQ Gaming Laptops) లాంచ్ చేసింది. NVIDIA నెక్స్ట్ జనరేషన్ జీఫోర్స్RTX 50 సిరీస్ GPUతో అమర్చి ఉన్నాయి. ఆగస్టు 7న రిలీజ్ అయిన మోడళ్లలో రిఫ్రెష్ లైనప్, మెయిన్ గేమర్‌లు, క్రియేటర్లకు హై పర్ఫార్మెన్స్, కస్టమైజడ్ ఆప్షన్లను కూడా అందిస్తాయి.
ఆసక్తిగల కొనుగోలుదారులు లేటెస్ట్ LOQ మోడళ్లను AMD రైజెన్ 7 250 లేదా ఇంటెల్ కోర్ i7-14700HX CPUతో NVIDIA GeForce RTX 5060 8GB గ్రాఫిక్స్‌తో పెయిర్ చేసి కాన్ఫిగర్ చేయవచ్చు. ఈ కొత్త మెషీన్‌లు 32GB వరకు ర్యామ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు (165Hz వరకు), ఇంటెలిజెంట్ పవర్ ఆప్టిమైజేషన్ కోసం లెనోవో LA1 AI చిప్‌ను కూడా కలిగి ఉంటాయి. “AAA గేమింగ్, స్ట్రీమింగ్ లేదా కంటెంట్ క్రియేషన్ కోసం LOQ ముఖ్యమైన స్పెషిఫికేషన్లను అందిస్తుంది” అని లెనోవా ఇండియా డైరెక్టర్, కేటగిరీ హెడ్ ఆశిష్ సిక్కా అన్నారు.
కొత్త RTX 50 సిరీస్ జీపీయూతో పాపులర్ కస్టమ్-టు-ఆర్డర్ ఫ్లెక్సిబిలిటీతో పాటు స్పీ్డ్, పర్ఫార్మెన్స్ అందిస్తున్నామని చెప్పారు. LOQ సిరీస్ లెనోవా సిగ్నేచర్ బోల్డ్ అయినా మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇ-షట్టర్‌తో 5MP వెబ్‌క్యామ్, 24-జోన్ RGBతో ఫుల్ సైజ్ కీబోర్డ్, 1.6mm కీ ట్రావెల్ కలిగి ఉంది. థర్మల్ పర్ఫార్మెన్స్ లెనోవా హైపర్‌చాంబర్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది.
హెవీ లోడ్ సమయంలో కూడా సరైన టెంపరేచర్ ఉండేలా కంట్రోల్ చేస్తుంది. లెనోవో (Lenovo.com) లో కొత్త లెనోవో LOQ ల్యాప్‌టాప్‌ల ధరలు రూ. 1,09,990 నుంచి లభ్యమవుతున్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు 15 రోజుల నుంచి 20 రోజుల డెలివరీ టైమ్ లిమిట్‌తో కస్టమ్-టు-ఆర్డర్ (CTO) మోడల్‌ను ఎంచుకోవచ్చు. స్టాండర్డ్ ఒక ఏడాది ఆన్‌సైట్ వారంటీ, యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ (ADP) అందిస్తాయి. 3ఏళ్ల అప్‌గ్రేడ్ బండిల్ ధర రూ. 3,999 నుంచి అందుబాటులో ఉంటాయి.