PM Kisan 21st instalment
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 21వ విడత విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశంలోని లక్షలాది మంది రైతులు రూ. 2వేలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులకు మాత్రమే 21వ విడత డబ్బులు అందనున్నాయి.
ప్రతి లబ్దిదారు రైతు తప్పనిసరిగా ఇ-కేవైసీ (PM Kisan 21st installment) పూర్తి చేసి ఉండాలి. లేదంటే రావాల్సిన డబ్బులు అందుకోలేరు. అందిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ 21వ విడత మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి, ఈ నవంబర్‌లోనే విడత డబ్బులు విడుదల కావాల్సి ఉంది. కానీ, బిహార్ ఎన్నికల నేపథ్యంలో పీఎం కిసాన్ విడత ఆలస్యమవుతోంది.
భారత ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనగా పిలుస్తారు. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. రూ.6 వేలు మొత్తాన్ని ప్రతి ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాలకు విడుదల అవుతుంది.
భారత ప్రభుత్వం ఇప్పటివరకు పీఎం కిసాన్ యోజన కింద మొత్తం 21 వాయిదాలను విడుదల చేసింది. అందులో ముందుగా వరద ప్రభావిత 4 రాష్ట్రాల (పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్) రైతుల ఖాతాలకు 21వ విడత డబ్బులు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను ప్రభుత్వం ఎప్పుడు వారి అకౌంట్లో పంపుతుందో అధికారిక తేదీని ప్రకటించలేదు.
లబ్ధిదారులకు e-KYC తప్పనిసరి :
ఇ-కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయని రైతులు 21వ విడత పొందేందుకు అర్హులు కారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రత్యేకంగా పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఇ-కేవైసీ తప్పనిసరిగా పేర్కొంది.
రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయడం ద్వారా 21వ వాయిదా స్టేటస్ చెక్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా తమ పేమెంట్ ప్రాసెస్ అయిందా లేదా ఇంకా పెండింగ్‌లో ఉందా అని చెక్ చేయొచ్చు.
మీడియా రిపోర్టుల ప్రకారం.. బీహార్ ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడతను విడుదల చేయవచ్చు. బీహార్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల అవుతాయి. అయితే, ఇంకా అధికారిక రిలీజ్ తేదీని ప్రకటించలేదు. ఈ పథకం 21వ విడత నుంచి మీరు ప్రయోజనం పొందాలనుకుంటే ఈ పథకానికి e-KYC తప్పనిసరిగా ఉండాలి.
మీరు ఇంకా మీ e-KYC పూర్తి చేయకపోతే పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. పీఎం కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in)ని వెబ్‌సైట్ విజిట్ ద్వారా ఈ పథకానికి మీ e-KYCని ఈజీగా పూర్తి చేయవచ్చు. ఈ స్కీమ్ కోసం మీ ల్యాండ్ రికార్డులను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. అప్లయ్ చేసేటప్పుడు ఏదైనా తప్పుడు డేటాను సమర్పిస్తే మీ అప్లికేషన్ రిజక్ట్ అవుతుంది జాగ్రత్త..