PM Kisan 20th installment
PM Kisan Yojana 20th installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత విడుదల కానుంది. మీరు కొత్తగా పీఎం కిసాన్ (PM Kisan Yojana) కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అయితే ఇది మీకోసమే.. దేశంలోని రైతుల వ్యవసాయ అవసరాల కోసం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద ప్రతి ఏడాదిలో రైతుల ఖాతాకు రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. మూడు వాయిదాల్లో రూ.2 వేలను పంపుతుంది. ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద మొత్తం 19 వాయిదాలను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, 20వ విడత విడుదల తేదీలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల్లో ఒక కుటుంబంలోని రైతు, భార్య ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చా అని అడుగుతుంటారు? దీనికి సంబంధించిన నియమాలు ఏంటి?.
పథకం నిబంధనల ప్రకారం.. రైతు భార్యాభర్తలు కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. ఒక కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే రూ. 2వేలు పొందగలరు. పీఎం కిసాన్ పథకం ద్వారా వ్యవసాయ భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఆ కుటుంబంలోని సభ్యునికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. ఈ డాక్యుమెంట్లను చెకింగ్ చేయడం చాలా అవసరం. తదుపరి వాయిదా మీ అకౌంటుకు సకాలంలో రావాలంటే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి.
e-KYC : ఇంకా e-KYC చేయని రైతులకు రూ. 2వేలు అందవు.
OTP ఆధారిత ప్రక్రియ ద్వారా లేదా సమీపంలోని CSC కేంద్రం నుంచి (pmkisan.gov.in)ని విజిట్ చేయడం ద్వారా రైతులు స్వయంగా e-KYC చేసుకోవచ్చు.
బ్యాంక్ ఖాతా లింకింగ్ : మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డుకు లింక్ చేయాలి. అకౌంట్ కూడా యాక్టివ్‌గా ఉండాలి.
లబ్ధిదారుడి స్టేటస్ చెకింగ్ చేయండి :
PM-KISAN పోర్టల్‌కు వెళ్లి మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయొచ్చు. “Beneficiary Status”లో మీ ఆధార్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
భూమి రికార్డులు, అర్హత : అనేక రాష్ట్రాల్లో భూమి రికార్డుల ఆధారంగా అర్హతను చెకింగ్ చేస్తున్నారు. భూమి మీ పేరు మీద రిజిస్టర్ కాకపోతే దరఖాస్తు తిరస్కరించవచ్చు.
e-KYC ఎలా చేయాలి? :
అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
“e-KYC” ఆప్షన్ క్లిక్ చేయండి.
ఆధార్ నంబర్ ఎంటర్ చేసి OTP వెరిఫికేషన్ చేయండి.
లబ్ధిదారు స్టేటస్ చెకింగ్ కోసం :
వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
“Know Your Status” సెక్షన్ వెళ్లి మీ ఆధార్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీరు సమర్పించిన వెంటనే మీ వాయిదా స్టేటస్ కనిపిస్తుంది.
వాయిదా రాకపోతే ఫిర్యాదు చేయాలి? :
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, e-KYC అప్‌డేట్ చేసి ఉండాలి. మునుపటి వాయిదా ఇంకా అందకపోయినా లేదా రాబోయే వాయిదా గురించి ఏవైనా సందేహాలు ఉంటే.. PM-KISAN హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 011-24300606కు కాల్ చేయవచ్చు లేదా (pmkisan-ict@gov.in) ద్వారా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.