Mahindra XUV 3XO : ఈ కారు రేంజే వేరబ్బా.. మహీంద్రా XUV 3XOపై ఏకంగా రూ. 4 లక్షలు డిస్కౌంట్.. ఇందులో ట్విస్ట్ ఉంది భయ్యా..!

Mahindra XUV 3XO : ప్రపంచవ్యాప్తంగా మహీంద్రా కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందులో మహీంద్రా XUV 3XO మోడల్ ఇప్పుడు చౌకైన ధరకే లభిస్తోంది.

Mahindra XUV 3XO : ఈ కారు రేంజే వేరబ్బా.. మహీంద్రా XUV 3XOపై ఏకంగా రూ. 4 లక్షలు డిస్కౌంట్.. ఇందులో ట్విస్ట్ ఉంది భయ్యా..!

Mahindra XUV 3XO

Updated On : July 5, 2025 / 11:04 AM IST

Mahindra XUV 3XO Price : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మహీంద్రా లవర్స్ కోసం అద్భుతమైన డిస్కౌంట్.. మహీంద్రా కొత్త మోడల్ XUV 3XO కారు ధర భారీగా తగ్గింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 4 లక్షలు తగ్గింది. ఇలాంటి ఆఫర్ (Mahindra XUV 3XO Price) అసలు మిస్ చేసుకోవద్దు..

భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో, XUV700, బొలెరో వంటి కార్లతో దుమ్మురేపుతోంది. SUV తయారీదారులలో వరుస విజయాలతో మహీంద్రా దూసుకుపోతోంది. అలాంటి మహీంద్రా బ్రాండ్ నుంచి ఎన్నో మోడల్ కార్లు మార్కెట్లో ఉన్నాయి.

అందులో థార్, థార్ రాక్స్ వంటి కార్లకు మాత్రం ఫుల్ క్రేజ్ ఉంది. ఈ కార్లతో పాటు, మహీంద్రా XUV 3XO మోడల్ కారు కూడా అందిస్తోంది. ఇందులో కాంపాక్ట్ SUV అద్భుతమైన ఫీచర్లు, విశాలమైన క్యాబిన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ XUV 3XO మోడల్ కారు ధరను మహీంద్రా ఒక్కసారిగా రూ. 4 లక్షలకు తగ్గించింది.. అయితే, ఇందులో ట్విస్ట్ కూడా ఉంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మహీంద్రా ఆస్ట్రేలియన్ మార్కెట్లో XUV 3XO మోడల్ లాంచ్ చేసింది. ఆస్ట్రేలియాలో అత్యంత సరసమైన మహీంద్రా SUV మోడల్ ఇది ఒక్కటే. అలాగే, మహీంద్రా XUV700, స్కార్పియో N, S11 4X4 పికప్‌ మోడల్స్ కూడా ఆస్ట్రేలియా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : ఆఫర్ అదుర్స్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ధర ఎంతంటే?

ఆస్ట్రేలియాలో ధర ఎంతంటే? :
మహీంద్రా XUV 3XO కేవలం 2 వేరియంట్ల (AX5 L, AX7 L)లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రత్యేకించి మహీంద్రా XUV 3XO ఆస్ట్రేలియన్ మార్కెట్లో రూ. 4 లక్షలకు చౌకగా లభిస్తోంది. ఆస్ట్రేలియన్ డాలర్లలో ఈ మోడల్ ధర AUD 23,490 (రూ. 13.18 లక్షలు) ఉంటుంది.

Mahindra XUV 3XO

Mahindra XUV 3XO

ఆస్ట్రేలియన్ మార్కెట్లో లభించే ఈ SUV కారు డిజైన్ మాత్రం మార్చలేదు. అలాగే, మహీంద్రా AX7 L వేరియంట్ SUV స్టీల్త్ బ్లాక్ కలర్ అందుబాటులో లేదు. ఆస్ట్రేలియన్ మార్కెట్లో మాజ్డా CX-3, హ్యుందాయ్ వెన్యూ, కియా స్టోనిక్ వంటి ఇతర కార్లతో మహీంద్రా XUV 3XO పోటీ పడుతోంది.

భారత మార్కెట్లో SUV 2 టర్బో పెట్రోల్ ఇంజిన్లతో వస్తుంది. 1.2-లీటర్ MPFi ఇంజిన్ 1.2-లీటర్ TGDi ఇంజిన్. TGDi ఇంజిన్ MPFi కన్నా పవర్‌ఫుల్. ఆస్ట్రేలియన్-స్పెక్ XUV 3XO MPFi ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది. ఆస్ట్రేలియాలో XUV 3XO డీజిల్ ఇంజిన్‌ కూడా లేదు.

ఇంకా ఏయే ఫీచర్లు ఉన్నాయంటే? :
మహీంద్రా XUV 3XO ఇండియా-స్పెక్ మోడల్ మాదిరిగానే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. భారత మార్కెట్లో XUV 3XO మోడల్ 3 మొత్తం ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ SUV మోడల్ ధర రూ. 9.37 లక్షల నుంచి రూ. 18.75 లక్షల (ఆన్-రోడ్, ముంబై) వరకు ఉంటుంది.

  • పనోరమిక్ సన్‌రూఫ్
  • లెవల్ 2 ADAS సూట్
  • డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ సెటప్
  • 360-డిగ్రీ కెమెరా
  • డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్

మూడు ఇంజన్ ఆప్షన్లలో : 

  • 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (MPFi) (110bhp & 200Nm)
  • 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (TGDi) (129bhp & 230Nm)
  • 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (115bhp & 300Nm)